Asianet News TeluguAsianet News Telugu

వేణుమాధవ్ నామినేషన్ తిరస్కరించిన రిటర్నింగ్ అధికారి

సినీనటుడు వేణుమాధవ్ కు తెలంగాణ ఎన్నికల సంఘం షాకిచ్చింది. తన స్వస్థలం కోదాడ నుండి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న వేణు మాధవ్ ఇవాళ నామినేషన్ వేసేందుకు ప్రయత్నించాడు. అయితే అతడు సమర్పించిన నామినేషన్ పత్రాలు సరిగ్గా లేవంటే ఎన్నికల సంఘం అధికారులు వాటిని తిరస్కరించారు. దీంతో వేణు మాధవ్ నామినేషన్ వేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. 

movie actor venu madhav nomination rejected
Author
Kodad, First Published Nov 16, 2018, 4:46 PM IST

సినీనటుడు వేణుమాధవ్ కు తెలంగాణ ఎన్నికల సంఘం షాకిచ్చింది. తన స్వస్థలం కోదాడ నుండి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న వేణు మాధవ్ ఇవాళ నామినేషన్ వేసేందుకు ప్రయత్నించాడు. అయితే అతడు సమర్పించిన నామినేషన్ పత్రాలు సరిగ్గా లేవంటే ఎన్నికల సంఘం అధికారులు వాటిని తిరస్కరించారు. దీంతో వేణు మాధవ్ నామినేషన్ వేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. 

సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన వేణు మాధవ్ సినీ నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే అతడికి ఇటీవల సినీమా వేషాలు బాగా తగ్గాయి. దీంతో అతడి చూపు రాజకీయాల వైపు మళ్ళింది. గతంలో తాను పనిచేసిన టిడిపి పార్టీ తరపున పలు సందర్భాల్లో ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఆ పార్టీ తరపున తెలంగాణలో పోటీ చేయాలని కూడా భావించారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా తన స్వస్థలం కొదాడ నుండి పోటీకి దిగాలని భావించాడు. 

ఇప్పటికే నామినేషన్  కోసం అవసరమైన పత్రాలను సమకూర్చుకున్న అతడు ఇవాళ (శుక్రవారం) కోదాడ తహసీల్దారు కార్యాలయంలో నామినేషన్‌ వేసేందుకు వెళ్లాడు. అయితే ఆయన నామినేషన్‌ పత్రాలను పరిశీలించిన అధికారులు అవి సరిగ్గా లేవంటూ తిరస్కరించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు సరైన వివరాలతో ఉంటేనే నామినేషన్ స్వీకరించడం జరుగుతుందని రిటర్నింగ్ అధికారి తెలిపారు. దీంతో వేణుమాధవ్ నామినేషన్ వేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. 

ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి సరైన పత్రాలు  సమకూర్చుకుని మరో రెండు రోజుల తర్వాత మళ్లీ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు వేణు మాధవ్ వెల్లడించారు. కోదాడ నుండి ఎట్టి పరిస్థితుల్లో తాను పోటీకి దిగడం ఖాయమని  ఆయన స్పష్టం చేశారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios