Asianet News TeluguAsianet News Telugu

మహా కూటమికి "తారాబలం": బాలయ్యకు తోడు నగ్మా, జూ.ఎన్టీఆర్ కూడా...

తెలంగాణ ఎన్నికల్లో తారల సందడి ఎక్కువైంది.. తెలుగు రాజకీయాలతో మొదటి నుంచి సినీరంగానికి విడదీయరాని అనుబంధం ఉంది. నాటి నుంచి నేటి వరకు చాలామంది తారలు వివిధ పార్టీలలో చేరి ఎన్నికల్లో పోటీచేయడమో.. లేదంటే ప్రచారం చేయడమో చేస్తూ వచ్చారు. తాజాగా తెలంగాణ ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది.

More cine glamour to Mahakutami for telangana elections
Author
Hyderabad, First Published Nov 21, 2018, 11:15 AM IST

తెలంగాణ ఎన్నికల్లో తారల సందడి ఎక్కువైంది.. తెలుగు రాజకీయాలతో మొదటి నుంచి సినీరంగానికి విడదీయరాని అనుబంధం ఉంది. నాటి నుంచి నేటి వరకు చాలామంది తారలు వివిధ పార్టీలలో చేరి ఎన్నికల్లో పోటీచేయడమో.. లేదంటే ప్రచారం చేయడమో చేస్తూ వచ్చారు. ప్రతి ఎన్నికల్లోనూ ఇది ఆనవాయితీగా మారింది. 

తాజాగా తెలంగాణ ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. స్వయంగా ఎన్నికల బరిలోకి దిగుతున్న నటులు ముగ్గురే అయినప్పటికీ ప్రచారంలో మాత్రం ప్రముఖ తారలంతా సంది చేయనున్నారు. మహాకూటమి తరపున నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, విజయశాంతి, ఖుష్భూ‌లు ప్రచారం చేస్తుండగా.. 90లలో స్టార్ హీరోయిన్ నగ్మా కూడా వీరికి జత కలిశారు.

ప్రముఖ కమెడియన్ బాబూమోహన్, హీరోయిన్ రేష్మా రాథోడ్ బీజేపీ నుంచి ఎన్నికల బరిలో నిలవగా, వేణుమాధవ్ కోదాడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అన్ని పార్టీలతో పోలిస్తే మహాకూటమిలోనే సినీగ్లామర్ వెలిగిపోతోంది. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విజయశాంతి.. కాంగ్రెస్‌లో చేరి ప్రస్తుతం ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారు. 

తొలుత ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ.. అధిష్టానం ఆదేశాల మేరకు కేవలం ప్రచార బాధ్యతల వరకే పరిమితమయ్యారు. ఇక మాజీ హీరోయిన్ ఖుష్భూ కూడా తెలంగాణలో ప్రచారానికి రెడీ అయ్యారు. వస్తూ వస్తూనే నిన్న కేసీఆర్‌పై విమర్శలు చేసి సవాల్ విసిరారు. అలనాటి ప్రముఖ హీరోయిన్ నగ్మా కూడా మహాకూటమి తరపున ప్రచారం చేస్తున్నారు. నిర్మాత బండ్ల గణేశ్ టీపీసీసీ అధికార ప్రతినిధిగా రంగంలోకి దిగారు. 

ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే.. తొలి నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా  ఉన్న నందమూరి కుటుంబం మరోసారి తమ సత్తా చూపించేందుకు రెడీ అయ్యారు. నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పటికే ఖమ్మంలో తొడగొట్టేశారు కూడా... ఈ  ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తున్న నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి మద్ధతుగా ఆమె సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌తో పాటు నందమూరి కుటుంబం ప్రచారం చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. 

వీరు సుహాసిని ఒక్కరికే క్యాంపెయినింగ్ చేస్తారా లేదంటే మిగిలిన మహాకూటమి అభ్యర్థులకు మద్ధతుగా నిలబడతారా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తం మీద మహాకూటమికి తారాబలం పెరగ్గా... రానున్న రోజుల్లో ఇంకెంతమంది ముందుకు వస్తారో వేచి చూడాలి. మరోవైపు మిగిలిన పార్టీలతో పోలిస్తే టీఆర్ఎస్‌లో మాత్రం తారల తళుకు బెళుకులు కనిపించడం లేదు. కారు తరపున నటులెవరూ బరిలో లేరు...అలాగే ప్రచారానికి సైతం దూరంగానే ఉన్నారు. 

సుహాసిని... తండ్రి పేరు.. భర్త పేరు అయ్యింది.

కమ్మ కోణంలో ఓటు వేయొద్దు.. సుహాసినిపై పోసాని కామెంట్స్!

సుహాసిని.. మా చెల్లిలాంటిది.. ప్రత్యర్థి కృష్ణారావు

దిమ్మతిరిగే కౌంటరిచ్చిన సుహాసిని: కూకట్‌పల్లి నుండి పోటీకి కారణమిదే

తొలిసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో అడుగు పెట్టిన సుహాసిని

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి సుహాసిని ఆస్తులివే

సుహాసినికి విజయం వరించాలి: జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

Follow Us:
Download App:
  • android
  • ios