Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ఆర్టీసీ సమ్మె... జగన్ బహిరంగ లేఖ

ఆర్టీసీ కార్మికులు వరసగా మూడో రోజు తమ సమ్మె కొనసాగిస్తున్నారు. కాగా.. సమ్మె విరమించలేదని ప్రభుత్వం కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రకటించింది. దీంతో..తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం ఉదయం ఆర్టీసీ కార్మికులు ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన నిరహారదీక్షకు తలపెట్టిన సంగతి తెలిసిందే. 

moaist leader jagan open letter on telangana RTC strike
Author
Hyderabad, First Published Oct 7, 2019, 10:55 AM IST

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి జగన్ బహరింగ లేఖ రాశారు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్లే నష్టాల్లో ఉందని చెప్పారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ  చేయడం కోసమే ప్రభుత్వంలో విలీనం చేయడం లేదని ఆరోపించారు.

ఆర్టీసీ కార్మికులు డిమాండ్లు  సాధించుకునే వరకు సమ్మె విరమించొద్దని సూచించారు. డిమాండ్ల సాధనకు కార్మికులు మిలిమెంట్ ఉద్యమాలు చేయాలని కోరారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని వర్గాల ప్రజలు మద్దు ఇవ్వాలని పిలుపుచ్చారు.

ఇదిలా ఉండగా.. ఆర్టీసీ కార్మికులు వరసగా మూడో రోజు తమ సమ్మె కొనసాగిస్తున్నారు. కాగా.. సమ్మె విరమించలేదని ప్రభుత్వం కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రకటించింది. దీంతో..తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం ఉదయం ఆర్టీసీ కార్మికులు ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన నిరహారదీక్షకు తలపెట్టిన సంగతి తెలిసిందే. కాగా... ఈ దీక్ష అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఇందిరాపార్క్ వద్దకు వచ్చిన వారిని అరెస్ట్ చేస్తామని ముందే ప్రకటించారు. ప్రకటించినట్లుగానే కొందరిని ఇప్పటికే అరెస్టు చేశారు.

అయితే...అరెస్టులు జరిగినా తమ దీక్ష మాత్రం కొనసాగుతుందని ఆర్టీసీ జేఎసీ ప్రకటించింది.ఇందిరాపార్క్ వద్ద తాము తలపెట్టిన నిరహారదీక్షకు మద్దతివ్వాలని పలు రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలను ఆర్టీసీ జేఎసీ కోరింది. ఈ మేరకు ఆయా పార్టీలు, ప్రజా సంఘాలు ఆర్టీసీ జేఎసీకి మద్దతుగా నిలిచాయి.

సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులను తొలగిస్తున్నట్టుగా సీఎం కేసీఆర్ ఆదివారం నాడు రాత్రి ప్రకటించారు. దీంతో సోమవారం నాడు ఇందిరాపార్క్ వద్ద ఆర్టీసీ జేఎసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరహారదీక్షకు దిగనున్నారు.ఇందిరా పార్క్ వద్ద దీక్షకు పోలీసులు అనుమతిని నిరాకరించారు.ఈ పరిస్థితుల్లో దీక్ష కొనసాగిస్తామని జేఎసీ ప్రకటించడంతో పోలీసులు భారీగా పోలీసులను మోహరించారు.

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించడాన్ని పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఆర్టీసీ కార్మికులకు సంఘీభావాన్ని తెలిపాయి. దీంతో ఇందిరాపార్క్ వద్ద దీక్ష ఎలా సాగుతోందనే ఉత్కంఠ నెలకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios