Asianet News TeluguAsianet News Telugu

ఇప్పటికైనా ప్రభుత్వానికి సరెండరవ్వండి: ఆర్టీసీ కార్మికులకు ఎర్రబెల్లి సూచన

ఆర్టీసీ కార్మికులు తప్పు తెలుసుకుని ప్రభుత్వానికి సరెండర్ అవ్వాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. యూనియన్ నేతల మాటలను కార్మికులు నమ్మొద్దని ఆయన సూచించారు. పండుగ వేళ ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూశారని కాంగ్రెస్, బీజేపీ వైఖరే ఆర్టీసీ పరిస్థితికి కారణమని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.

minister errabelli dayakar rao comments on rtc strike
Author
Hyderabad, First Published Oct 8, 2019, 1:09 PM IST

ఆర్టీసీ కార్మికులు తప్పు తెలుసుకుని ప్రభుత్వానికి సరెండర్ అవ్వాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. యూనియన్ నేతల మాటలను కార్మికులు నమ్మొద్దని ఆయన సూచించారు.

పండుగ వేళ ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూశారని కాంగ్రెస్, బీజేపీ వైఖరే ఆర్టీసీ పరిస్థితికి కారణమని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. సమ్మెకు మద్ధతివ్వడానికి కాంగ్రెస్, బీజేపీలకు సిగ్గుండాలని ఆయన మండిపడ్డారు.

కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని విలీనం చేశారా అని ఎర్రబెల్లి ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ఆర్టీసీ ఉద్యోగులకు అత్యధిక జీతాలు చెల్లిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. యూనియన్ నాయకులను కార్మికులు నిలదీయాలని దయాకర్ రావు సూచించారు.

కాగా టీఎస్ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరించమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్టీసీపై సునీల్ శర్మ కమిటీతో సోమవారం ప్రగతిభవన్‌లో కేసీఆర్ సమావేశమయ్యారు. నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఆర్టీసీ ప్రైవేటీకరణ, సమ్మె తదితర అంశాలపై చర్చించారు.

అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. క్రమశిక్షణతో ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తామన్నారు. టీఎస్ఆర్టీసీ ఉంటుందని పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు. ఆర్టీసీ ఎండీ కొనసాగుతారని.. సంస్థను మూడురకాలుగా విభజిస్తామని 50 శాతం బస్సులు ఆర్టీసీలో నడుపుతామని సీఎం పేర్కొన్నారు.

30 శాతం బస్సులు మాత్రం అద్దెవి నడుపుతామని... ప్రైవేట్ కేజ్ గ్యారేజ్‌ను అనుమతిస్తామని..ఆర్టీసీ ఛార్జీలు, ప్రైవేట్ ఛార్జీలు సమానంగా ఉంటాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. సమ్మెను తీవ్రతరం చేస్తామనడం హాస్యాస్పదమని.. ఆర్టీసీ సిబ్బంది కేవలం 1200 మంది మాత్రమేనని సీఎం స్పష్టం చేశారు.

మేం డిస్మిస్ చేయలేదు... వాళ్లంతట వాళ్లే తొలగిపోయారన్నారు. గడువులోగా విధుల్లో చేరనివారు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని.. డిపోలు, స్టేషన్ల వద్ద గొడవలు చేయకుండా ప్రత్యేక బృందాలు ఉంటాయని సీఎం తెలిపారు. ఇకపై కూడా సబ్సిడీ పాస్‌లు కొనసాగుతాయని మఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇకపై ఆర్టీసీలో యూనియనిజం ఉండదన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios