Asianet News TeluguAsianet News Telugu

అమీర్ పేట్-హైటెక్ సిటీ మార్గంలో మెట్రో పరుగులు...(వీడియో)

మెట్రో రైలు...హైదరాబాద్ నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి నేనున్నానంటూ గతేడాది మన ముందుకు వచ్చింది. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ వాసులను నిర్మాణ దశలోనే ఊరించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మొదటి దశ గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక రెండో దశను కూడా ఇటీవలే గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. 

Metro starts ameerpet to  hitech city
Author
Hyderabad, First Published Nov 29, 2018, 6:18 PM IST

మెట్రో రైలు...హైదరాబాద్ నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చడానికి నేనున్నానంటూ గతేడాది మన ముందుకు వచ్చింది. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ వాసులను 
నిర్మాణ దశలోనే ఊరించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మొదటి దశ గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక రెండో దశను 
కూడా ఇటీవలే గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. 

మెట్రో పరుగులు ప్రారంభమై నేటికి ( 29 నవంబర్ 2018 మంగళవారానికి) సంవత్సరం కాలం గడించింది. ఇలా అన్ని అవాంతరాలను దాటుకుంటూ సక్సెస్్ ఫుల్ గా 
మొదటి ఏడాదిని పూర్తిచేసుకున్న మెట్రోలో మరో ముఖ్యమైన మార్గం త్వరలో ప్రారంభంకానుంది. ఈ మెట్రోలో మూడో కారిడార్ లో భాగమైన అమీర్ పేట- హైటెక్ 
సిటీ మార్గాల్లో మెట్రో రైలు ట్రయల్ రన్ ప్రారంభమైంది. మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి, నిర్మాణ సంస్థ ఎల్&టి ఎండి కెవిబి రెడ్డి ఈ మార్గంలో మెట్రో రైలు ట్రయల్ రన్ 
ప్రారంభించారు.

అమీర్, పేట- హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైలు మొత్తం 10 కిలోమీటర్లు ప్రయాణించనుంది. ఈ మార్గంలో మధురా నగర్, యూసుఫ్ గూడ, జూబ్లీ హిల్స్, జూబ్లీ హిల్స్ 
చెక్ పోస్ట్, పెద్దమ్మ గుడి, మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్ సిటి వంటి ముఖ్యమైన 8 ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా ఐటీ రంగం అభివృద్ది చెంది 
ఉండటంతో ఐటీ ఉద్యోగులకు ఈ మూడో కారిడార్ బాగా ఉపయోగపడనుంది.

ట్రయల్ రన్ ద్వారా సాంకేతిక సమస్యలను అదిగమించి త్వరలో ఈ  మార్గాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మెట్రో ఎండి ప్రకటించారు. ఈ 
మార్గం అందుబాటులోకి వస్తే అత్యంత రద్దీగా వుండే హైటెక్ సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గే అవకాశం ఉందని ఎన్వీఎస్ రెడ్డి  తెలిపారు.

                                 "

Follow Us:
Download App:
  • android
  • ios