Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి చేసుకోనందుకు అక్కని.. కంప్లయింట్ ఇచ్చిందని చెల్లిని వేశ్యలను చేశాడు

ఓ దుర్మార్గుడు అమాయకులైన అక్కాచెల్లెళ్లను డబ్బు కోసం కాల్‌గర్ల్స్‌గా చిత్రించాడు. నాగ్‌పూర్‌కు చెందిన రియాజ్ అన్సారీకి పెళ్లయ్యింది..సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో వితంతువులను పెళ్లి చేసుకుంటే కట్నంగా రూ.లక్షలు ఇస్తారని... తర్వాత కొద్దిరోజుల పాటు ఎవ్వరికి కనిపించకుండా వుంటే డబ్బు మిగులుతుందన్న ఆలోచించాడు. 

married men harass sisters
Author
Hyderabad, First Published Oct 11, 2018, 9:48 AM IST

ఓ దుర్మార్గుడు అమాయకులైన అక్కాచెల్లెళ్లను డబ్బు కోసం కాల్‌గర్ల్స్‌గా చిత్రించాడు. నాగ్‌పూర్‌కు చెందిన రియాజ్ అన్సారీకి పెళ్లయ్యింది..సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో వితంతువులను పెళ్లి చేసుకుంటే కట్నంగా రూ.లక్షలు ఇస్తారని... తర్వాత కొద్దిరోజుల పాటు ఎవ్వరికి కనిపించకుండా వుంటే డబ్బు మిగులుతుందన్న ఆలోచించాడు.

వెంటనే షాదీడాట్‌.కాం పేరుతో నకిలీ వెబ్‌సైట్‌‌లో.. తన భార్య చనిపోయిందని... కొడుకు మాత్రమే ఉన్నాడంటూ నకిలీ వివరాలు ఉంచాడు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వితంతువు అన్సారీ ప్రొఫైల్ చూసి అతడితో ఫోన్‌లో మాట్లాడింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి.. కట్నకానుకలు మాట్లాడుకుని జూన్ రెండో వారంలో పెళ్లి చేసుకుందామని చెప్పాడు.

పెళ్లికి వారం రోజుల ముందు అన్సారీ అసలు భార్య.. నవ వధువుకి ఫోన్ చేసి తాను బతికే ఉన్నానని చెప్పింది. దీంతో అమ్మాయి తరపు వారు పెళ్లి రద్దు చేసుకున్నారు9. రూ.లక్షల కట్నం చేతిదాకా వచ్చి పోయిందన్న కసితో అన్సారీ సదరు వితంతువు ఫోటోలను అశ్లీల వెబ్‌సైట్లు, డేటింగ్ సైట్లలో ఉంచి కార్ల్‌గర్ల్ అని చెప్పి ఆమె ఫోన్ నెంబర్ ఇచ్చాడు.

అపరిచితుల నుంచి విపరీతంగా ఫోన్లు రావడంతో ఆమె భరించలేక నెంబర్ మార్చేసింది.. అయితే హైదరాబాద్‌లో ఉంటున్న ఆమె చెల్లి నిందితుడిని పోలీసులకు పట్టిద్దామని చెప్పి.. రెండు నెలల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల సూచనల మేరకు వితంతువు ఆగస్టు తొలివారంలో అన్సారీకి ఫోన్ చేసింది..

పెళ్లి చేసుకునేందుకు తనకు ఇష్టమేనని.. హైదరాబాద్ రావాలని చెప్పి.. ఎస్సార్‌నగర్ బస్టాప్ వద్ద వేచి ఉంది.. అక్కడికి వచ్చిన అన్సారీ మఫ్టీలో ఉన్న పోలీసులను గుర్తించాడు. వెంటనే వితంతువుకు ఫోన్ చేసి.. తనకు ఇక్కడ అనుమానంగా ఉందని.. సికింద్రాబాద్ స్టేషన్‌కు రావాల్సిందిగా సూచించాడు. అన్సారీ తప్పించుకునేందుకు ఎత్తు వేశాడని గ్రహించిన పోలీసులు నాంపల్లి స్టేషన్‌లో అతన్ని వలపన్ని పట్టుకున్నారు.

అనంతరం కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన అన్సారీ అక్కాచెల్లెళ్లపై కక్షగట్టాడు. తనను పట్టించడంలో చెల్లిదే కీలకపాత్ర అని గుర్తించాడు. ఆమె ఫోటోలను సేకరించి.. ఆమె పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను తెరిచాడు.

ఫోటోలను మార్ఫింగ్ చేసి నగ్నంగా ఉన్నట్లు వీడియోలు, ఫోటోలు అందులో ఉంచాడు. వారి కుటుంబానికి చెందిన స్నేహితులు, బంధువులను నెంబర్లకు వాట్సాప్ ద్వారా వీటిని పంపాడు.. ఆలస్యంగా దీనిని గుర్తించిన బాధితురాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. అన్సారీయే ఇలా చేస్తున్నాడని గుర్తించిన పోలీసులు.. నాగపూర్‌లో అతన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios