Asianet News TeluguAsianet News Telugu

మధులిక పరిస్థితి విషమం: 72 గంటలు అబ్జర్వేషన్

మధులిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని  యశోధ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్‌పై మధులికకు చికిత్స అందిస్తున్నట్టు యశోధ వైద్యులు ప్రకటించారు

madhulika health condition critical says yashoda doctors
Author
Hyderabad, First Published Feb 6, 2019, 2:31 PM IST

హైదరాబాద్: మధులిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని  యశోధ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్‌పై మధులికకు చికిత్స అందిస్తున్నట్టు యశోధ వైద్యులు ప్రకటించారు.మధులిక ప్రస్తుతం కోమాలో ఉందని వైద్యులు చెప్పారు.

బుధవారం నాడు యశోధ ఆసుపత్రి వైద్య బృందం మధులిక ఆరోగ్య పరిస్థితిపై మీడియాతో మాట్లాడారు.  మధులిక శరీరంపై  చాలా చోట్ల గాయాలు ఉన్నట్టు చెప్పారు.  మధులిక శరీరం నుండి తీవ్రంగా రక్తస్రావమైనట్టు చెప్పారు.

మధులిక ఎడమ చేయి చిటికెన వేలు పూర్తిగా తెగిపోయిందని వైద్యులు ప్రకటించారు.  రక్తం ఎక్కువగా పోయినందున బాధితురాలు షాక్‌లో ఉందన్నారు.

డాక్టర్ల బృందం మధులికను పరీక్షిస్తున్నట్టు చెప్పారు. తల, వీపు, చేతులపై తీవ్ర గాయాలైనట్టు చెప్పారు. మధులిక ఆరోగ్య పరిస్థితిపై 48 గంటల నుండి 72 గంటల తర్వాత స్పష్టత ఇస్తామని యశోద వైద్యులు ప్రకటించారు.

ఇదిలా ఉంటే మధులిక కుటుంబ సభ్యులను అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ  ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పరామర్శించారు. 

సంబంధిత వార్తలు

హైదరాబాద్‌లో నడిరోడ్డు మీద యువతిపై ప్రేమోన్మాది దాడి


 

Follow Us:
Download App:
  • android
  • ios