Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌కు షాక్: టీఆర్ఎస్‌లో చేరనున్న క్యామ మల్లేష్

రంగారెడ్డి మాజీ డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ ఆదివారం నాడు సాయంత్రం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్నారు.

kyma mallesh likely to join in trs today
Author
Hyderabad, First Published Nov 25, 2018, 12:47 PM IST


హైదరాబాద్: రంగారెడ్డి మాజీ డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ ఆదివారం నాడు సాయంత్రం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్నారు.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం   నియోజకవర్గం నుండి కాంగ్రెస్ టికెట్టును క్యామ మల్లేష్ ఆశించారు. ఈ మేరకు ఢిల్లీలో కూడ లాబీయింగ్ నిర్వహించారు.

కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మెన్  భక్త చరణ్ దాస్  తనయుడు  తన కొడుకును ఇబ్రహీంపట్నం టికెట్టు కోసం రూ. 3 కోట్లు డిమాండ్ చేశారని క్యామ మల్లేష్ మీడియాకు వివరించారు. 

కాంగ్రెస్ పార్టీ స్క్రినింగ్ కమిటీ ఛైర్మెన్ భక్త చరణ్ దాస్  తనయుడి మీడియా సంభాషణను మీడియాకు వివరించినందుకు గాను  కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్ష పదవి నుండి  మల్లేష్ ను తొలగించింది.

ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పోటీ పడ్డారు. కానీ, ఈ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా టీడీపీకి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ.  కానీ మల్‌రెడ్డి రంగారెడ్డి  బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగాడు.

బీఎస్పీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన మల్‌రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ పార్టీ మద్దతును ప్రకటించింది.  2014 ఎన్నికల సమయంలో ఇబ్రహీంపట్నం నుండి మల్ రెడ్డి రంగారెడ్డి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. ఆ సమయంలో క్యామ మల్లేష్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

ఈ దఫా కూడ క్యామ మల్లేష్‌ కాంగ్రెస్ టికెట్టును ఆశించారు.కానీ  టికెట్టు దక్కలేదు.  కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలపై విమర్శలు చేసిన క్యామ మల్లేష్ పై  విమర్శలు చేసినందుకు ఆయనపై వేటేశారు. దీంతో మల్లేష్ ఇవాళ టీఆర్ఎస్‌లో మల్లేష్ చేరనున్నారు.  ఆదివారం సాయంత్రం కేసీఆర్ సమక్షంలో  మల్లేష్ టీఆర్ఎస్‌లో చేరనున్నారు.

సంబంధిత వార్తలు

రూ. 10 కోట్లు తీసుకొని దానంపై దాసోజుకు టికెట్టు: క్యామ మల్లేష్ సంచలనం

కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ మూడో జాబితా: పొన్నాలకు క్లియర్, జానా కొడుక్కి టికెట్టు

కోదండరామ్ ఎలా గెలుస్తాడో చెప్పండి: పొన్నాల సవాల్

పొన్నాలకు దక్కని టికెట్ ... కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు

జనగామ నుండి తప్పుకొన్న కోదండరామ్: పొన్నాలకు లైన్‌క్లియర్

జనగామ టికెట్ నాదే..ధీమా వ్యక్తం చేసిన పొన్నాల

కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం

పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్

జనగామ పొన్నాలకే... హైకమాండ్ రహస్య సంకేతాలు: ఆ వర్గానికి షాక్

కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య

జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్

జనగామలో పొన్నాలకు కోడలు చిక్కులు

పొన్నాలకు కాంగ్రెస్ నేతల షాక్

పొన్నాలకు కోమటిరెడ్డి పొ

 

Follow Us:
Download App:
  • android
  • ios