Asianet News TeluguAsianet News Telugu

కేటీఆర్ బంపరాఫర్: అయినా పార్టీని వీడిన విశ్వేశ్వర్ రెడ్డి

టీఆర్ఎస్‌లో  చేవేళ్ల  ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఇబ్బందులు పడినట్టుగా  ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ ఇబ్బందులను  దిగమింగుతూ పార్టీలోనే కొనసాగారు

ktr final conversations with konda vishweshwar reddy
Author
Hyderabad, First Published Nov 21, 2018, 2:03 PM IST


హైదరాబాద్:  టీఆర్ఎస్‌లో  చేవేళ్ల  ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఇబ్బందులు పడినట్టుగా  ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ ఇబ్బందులను  దిగమింగుతూ పార్టీలోనే కొనసాగారు. ఈ  విషయాన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ విశ్వేశ్వర్ రెడ్డికి  గాలం వేసింది.  విశ్వేశ్వర్ రెడ్డి అనుచరులకు ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  టికెట్లను కేటాయించింది.   మరో వైపు కేటీఆర్  హామీ ఇచ్చినా కూడ విశ్వేశ్వర్ రెడ్డి తగ్గలేదు. కేటీఆర్‌తో సమావేశమైన  నాలుగు రోజుల తర్వాత టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు.

నాలుగు రోజుల క్రితం తెలంగాణ మున్సిఫల్ శాఖ మంత్రి కేటీఆర్‌తో చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. కేటీఆర్‌తో సమావేశమయ్యేందుకు విశ్వేశ్వర్ రెడ్డి తన రాజీనామా లేఖను  జేబులో పెట్టుకొని వెళ్లాడు. కానీ కేటీఆర్  విశ్వేశ్వర్ రెడ్డిని సముదాయించే ప్రయత్నం చేశారు.  వచ్చే 15 నుండి 20 ఏళ్ల పాటు  తెలంగాణలో  టీఆర్ఎస్  ప్రభుత్వం ఉంటుంది.  పార్టీని వీడితే  నష్టపోతారని కేటీఆర్ చేవేళ్ల ఎంపీకి చెప్పినట్టు సమాచారం.

మంగళవారం నాడు  ఉదయం కూడ  ఎన్నికల్లో ప్రచారం నిర్వహించాలని కేటీఆర్  విశ్వేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడినట్టు సమాచారం. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ యాధవరెడ్డి కూడ ఎన్నికల ప్రచారంలో కూడ పాల్గొనడం లేదు. ప్రచారానికి తాను దూరంగా ఉంటానని విశ్వేశ్వర్ రెడ్డి తేగేసి చెప్పినట్టు సమాచారం. ఆ తర్వాతే  విశ్వేశ్వర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. 

తెలంగాణ అని నినదించిన దివంగత  మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకటరంగారెడ్డి మనమడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.  కొండా విశ్వేశ్వర్ రెడ్డి 2013లో టీఆర్ఎస్‌లో చేరారు. 2014 ఎన్నికల ముందు టీడీపీ నుండి టీఆర్ఎస్‌లో చేరిన  పట్నం మహేందర్ రెడ్డితో  కొండా విశ్వేశ్వర్ రెడ్డికి  మధ్య అధిపత్య పోరు నెలకొంది. 
మహేందర్ రెడ్డి పార్టీపై పూర్తిగా అధిపత్యాన్ని సాధించారని సమాచారం. పార్టీలో తన వర్గీయులను పక్కన పెడుతున్నారని విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. రెండేళ్లుగా  వీరిద్దరి మధ్య ఈ పరిస్థితి మరింత  ఎక్కువైంది.  ఈ పరిణామాల నేపథ్యంలో  మంగళవారం సాయంత్రం విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.

చేవేళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డికి  కూడ పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం అందేది కాదు. పార్టీ పదవుల విషయంలో కూడ  విశ్వేశ్వర్ రెడ్డి అనుచరులకు ప్రాధాన్యత తక్కువగా ఉండేది.  తాండూరుకు చెందిన  తన  ముఖ్య అనుచరుడు రోహిత్ రెడ్డి‌ని పార్టీ నుండి సస్పెన్షన్‌ చేయడంతో విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత  పైసా పోయింది... పరువూ పోయిందని  విశ్వేశ్వర్ రెడ్డి  తన అనుచరుల వద్ద వ్యాఖ్యానించారని సమాచారం.

పార్టీలో జరుగుతున్న పరిణామాలతో విశ్వేశ్వర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్న విషయాన్ని తెలుసుకొన్న కాంగ్రెస్ నేతలు ఆయనతో చర్చించారు. తన అనుచరులు పైలెట్ రోహిత్ రెడ్డి,  చేవేళ్ల నుండి కేఎస్ రత్నంలకు కాంగ్రెస్ టికెట్లను కేటాయించింది.మంగళవారం నాడు కేటీఆర్ ఫోన్ తర్వాత విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.

సంబంధిత వార్తలు

ఇది ఆరంభం మాత్రమే: విశ్వేశ్వర్ రెడ్డి చేరికపై కుంతియా

రెండేళ్లుగా నా బాధను ఎవరూ పట్టించుకోలేదు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

విశ్వేశ్వర్ రెడ్డి పార్టీని వీడినా నష్టం లేదు: మహేందర్ రెడ్డి

ఢిల్లీలో కొండా రాజకీయాలు.. ఇవాళ రాహుల్‌‌ గాంధీతో భేటీ

విశ్వేశ్వర రెడ్డి రాజీనామా: ఆయన చెప్పిన ఐదు కారణాలు ఇవీ...

ఇమడలేకపోతున్నా: విశ్వేశ్వర్ రెడ్డి, 23న కాంగ్రెస్‌లోకి...

విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా: కాంగ్రెస్‌కు కలిసొచ్చిన వరం

2నెలల ముందే విశ్వేశ్వరరెడ్డి రాజీనామాకు స్కెచ్

రేవంత్ మాట నిజమే,టీఆర్ఎస్ ఫస్ట్ వికెట్ డౌన్

కేసీఆర్‌కు బిగ్ షాక్: టీఆర్ఎస్‌కు ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా (వీడియో)

కేసీఆర్ కు షాక్: కాంగ్రెసులోకి ఎంపీ విశ్వేశ్వర రెడ్డి?

ఆ ఆలోచన లేదు: కేసీఆర్ తో భేటీ తర్వాత విశ్వేశ్వర రెడ్డి

రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు: టీఆర్ఎస్ ఎంపీ

కాంగ్రెస్ లోకి ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు:టచ్ లో ఉన్నారన్న రేవంత్

 

Follow Us:
Download App:
  • android
  • ios