Asianet News TeluguAsianet News Telugu

విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా: కాంగ్రెస్‌కు కలిసొచ్చిన వరం

తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా  చేవేళ్ల ఎంపీ  విశ్వేశ్వర రెడ్డి రాజీనామా చేయడం  టీఆర్ఎస్‌కు  బిగ్ షాక్

konda vishweshwar reddy resigns: it is advantage to congress
Author
Hyderabad, First Published Nov 20, 2018, 6:27 PM IST


హైదరాబాద్: తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా  చేవేళ్ల ఎంపీ  విశ్వేశ్వర రెడ్డి రాజీనామా చేయడం  టీఆర్ఎస్‌కు  బిగ్ షాక్.  అయితే ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీ ఉత్సాహన్ని ఇచ్చే అవకాశం లేకపోలేదని  రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

2013లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి  టీఆర్ఎస్‌లో చేరారు. అయితే ఆ తర్వాత 2014 ఎన్నికల్లో చేవేళ్ల నుండి  విశ్వేశ్వర్ రెడ్డి  టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

2014 ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడానికి ముందుగా టీడీపీలో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి, కేఎస్ రత్నం, పట్నం నరేందర్ రెడ్డిలు ఆ సమయంలో ఢిల్లీలో ఉన్న కేసీఆర్  సమక్షంలో  టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు.

ఆ సమయంలో వీరూ ముగ్గురూ కూడ  టీడీపీలో ఉన్నారు. ఆ సమయంలో తాండూరు నుండి మహేందర్ రెడ్డి, చేవేళ్ల నుండి కేఎస్ రత్నంలు ఎమ్మెల్యేలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డి ఆ సమయంలో  పరిగి టీడీపీ ఇంచార్జీగా   ఉన్నారు.

ఇదిలా ఉంటే మహేందర్ రెడ్డి టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరే సమయంలో  జిల్లాలో పార్టీ బాధ్యతలతో పాటు మంత్రి పదవిని కూడ ఇస్తామని టీఆర్ఎస్ ఆ సమయంలో ఆఫర్ ఇచ్చింది. ఆ సమయంలో రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్‌ కొంత బలహీనంగా ఉండేది. ఈ సమయంలో  మహేందర్ రెడ్డి  టీఆర్ఎస్ లో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చింది.  మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిన తర్వాత విశ్వేశ్వర్ రెడ్డి మధ్య అధిపత్య  పోరు  ఉధృతమైంది. 

మహేందర్ రెడ్డి వ్యూహంలో విశ్వేశ్వర్ రెడ్డి  సక్సెస్ కాలేదు. ఈ విషయాలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాలపై కేసీఆర్  ఇద్దరితో మాట్లాడారు.  కానీ, ఈ సమస్య పరిష్కారం కాలేదు. దీంతో కొంత కాలంగా  విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. రెండేళ్ల క్రితమే ఆయన  పార్టీకి దూరం కావాలని భావించారు.  కానీ,  ఈ రెండేళ్ల పాటు టీఆర్ఎస్‌లో కొనసాగారు. 

ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో  టీఆర్ఎస్‌ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి  టీఆర్ఎస్‌కు, ఎంపీ పదవికి  రాజీనామా చేయడంతో   టీఆర్ఎస్‌ పై కొంత ప్రభావం ఉండే అవకాశం లేకపోలేదని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఈ పరిణామం  కాంగ్రెస్ కు కలిసొచ్చే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

విశ్వేశ్వర్ రెడ్డి తో పాటు  మరో ఎంపీ కూడ టీఆర్ఎస్‌ను వీడుతారని  కూడ ప్రచారం సాగింది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడ   కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నారని ప్రకటించారు.

రంగారెడ్డి జిల్లాతో పాటు  ఇతర జిల్లాల్లో కూడ ఈ ప్రభావం ఉండే అవకాశం లేకపోలేదు. ఇదే సమయంలో ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో  టికెట్టు దక్కని అసంతృప్తులను అన్ని పార్టీలు తమ వైపుకు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే  విశ్వేశ్వర్ రెడ్డి  రాజీనామాను కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా వినియోగించే  అవకాశం లేకపోలేదు.

 

సంబంధిత వార్తలు

కేసీఆర్‌కు బిగ్ షాక్: టీఆర్ఎస్‌కు ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా

కేసీఆర్ కు షాక్: కాంగ్రెసులోకి ఎంపీ విశ్వేశ్వర రెడ్డి?

ఆ ఆలోచన లేదు: కేసీఆర్ తో భేటీ తర్వాత విశ్వేశ్వర రెడ్డి

రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు: టీఆర్ఎస్ ఎంపీ

కాంగ్రెస్ లోకి ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు:టచ్ లో ఉన్నారన్న రేవంత్

Follow Us:
Download App:
  • android
  • ios