Asianet News TeluguAsianet News Telugu

ఇమడలేకపోతున్నా: విశ్వేశ్వర్ రెడ్డి, 23న కాంగ్రెస్‌లోకి...

నాది కాంగ్రెస్ బ్లడ్..... టీఆర్ఎస్‌లో ఇమడలేకపోతున్నా... అంటూ సన్నిహితుల వద్ద ఇటీవలనే చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు చెప్పారు.
 

konda vishweshwar reddy may join in congress on nov 23
Author
Hyderabad, First Published Nov 20, 2018, 6:49 PM IST


హైదరాబాద్: నాది కాంగ్రెస్ బ్లడ్..... టీఆర్ఎస్‌లో ఇమడలేకపోతున్నా... అంటూ సన్నిహితుల వద్ద ఇటీవలనే చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు చెప్పారు.

2013 లో  కొండా విశ్వేశ్వర్ రెడ్డి  టీఆర్ఎస్ లో చేరారు. 2014 ఎన్నికల ముందు టీడీపీ నుండి  పట్నం మహేందర్ రెడ్డి, కేఎస్ రత్నం, పట్నం నరేందర్ రెడ్డిలు  టీఆర్ఎస్‌లో చేరారు.

పట్నం సోదరులు టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో  పట్నం మహేందర్ రెడ్డి హవా ప్రారంభమైంది. ఈ పరిణామం విశ్వేశ్వర్ రెడ్డికి నచ్చలేదు. ఈ విషయాన్ని పార్టీ  నాయకలు కూడ  వివరించారు. కానీ, ఈ సమస్యను పరిష్కరించలేదు. దీంతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు.

రెండేళ్ల క్రితమే విశ్వేశ్వర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయాలని భావించారు. కానీ ఆ సమయంలో కొన్ని కారణాలతో ఈ  ప్రయత్నాన్ని విరమించుకొన్నారు.నాలుగు రోజుల క్రితమే  కేటీఆర్ విశ్వేశ్వర్ రెడ్డితో చర్చించారు. తాను టీఆర్ఎస్‌లో ఉంటానని  ఆయన ప్రకటించారు. కానీ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు.

పార్టీలో తన పట్ల వివక్ష సాగుతోందని విశ్వేశ్వర్ రెడ్డి అభిప్రాయంతో ఉన్నారు. మహేందర్ రెడ్డికి ప్రాధాన్యత ఇస్తున్నారనే అభిప్రాయంతో ఆయన  కూడ ఉన్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో  పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలపై విశ్వేశ్వర్ రెడ్డి తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం.

టీఆర్ఎస్‌లో తాను  ఇమడలేకపోతున్నట్టు కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. తనది కాంగ్రెస్ బ్లడ్ అని విశ్వేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ బ్లడ్.... అయినా టీఆర్ఎస్ లో ఉన్నా.... ఈ పార్టీలో ఇమడలేకపోతున్నాను అంటూ విశ్వేశ్వర్ రెడ్డి సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.  భవిష్యత్తులో కూడ తమకు ఇబ్బంది ఉంటుందని భావించి విశ్వేశ్వర్ రెడ్డి  టీఆర్ఎస్ కు , ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇదిలా ఉంటే ఈ నెల 23వ తేదీన మేడ్చల్ లో నిర్వహించే  సోనియా గాంధీ, రాహుల్ గాంధీ  సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది.  ఈ సభలోనే   కొండా విశ్వేశ్వర్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరుతారు.


సంబంధిత వార్తలు

విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా: కాంగ్రెస్‌కు కలిసొచ్చిన వరం

కేసీఆర్‌కు బిగ్ షాక్: టీఆర్ఎస్‌కు ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా

కేసీఆర్ కు షాక్: కాంగ్రెసులోకి ఎంపీ విశ్వేశ్వర రెడ్డి?

ఆ ఆలోచన లేదు: కేసీఆర్ తో భేటీ తర్వాత విశ్వేశ్వర రెడ్డి

రేవంత్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు: టీఆర్ఎస్ ఎంపీ

కాంగ్రెస్ లోకి ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు:టచ్ లో ఉన్నారన్న రేవంత్

Follow Us:
Download App:
  • android
  • ios