Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్సీ ఎన్నికలు: కాంగ్రెస్‌కు నో చెప్పిన కొండా దంపతులు

: వరంగల్ జిల్లా  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  పోటీకి దూరంగా ఉండాలని కొండా దంపతులు ఉన్నారని సమాచారం. ఈ విషయమై  తమ అభిప్రాయాన్ని పార్టీ నేతలకు సమాచారం ఇచ్చినట్టుగా చెప్పారు.

konda murali decides to not contested in mlc elections
Author
Warangal, First Published May 12, 2019, 4:46 PM IST

వరంగల్: వరంగల్ జిల్లా  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  పోటీకి దూరంగా ఉండాలని కొండా దంపతులు ఉన్నారని సమాచారం. ఈ విషయమై  తమ అభిప్రాయాన్ని పార్టీ నేతలకు సమాచారం ఇచ్చినట్టుగా చెప్పారు.

ఈ నెల 14వ తేదీన నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి రోజు. వరంగల్ అభ్యర్థిగా పరకాల ఇంచార్జీ వెంకట్రామిరెడ్డి పేరు దాదాపు ఫైనల్ అయింది. ఐదేళ్ల క్రితం  వరంగల్ జిల్లా నుండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొండా మురళి పోటీ చేసి విజయం సాధించారు. గత ఏడాది డిసెంబర్‌ మాసంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొండా దంపతులు టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా  ఎమ్మెల్సీ పదవికి కొండా మురళి రాజీనామా చేశారు.  అయితే వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల  నోటీఫికేషన్ విడుదలైంది. అయితే ఈ దఫా పోటీ చేయడానికి మాత్రం   కొండా మురళి గానీ, సురేఖ కానీ ఆసక్తి చూపలేదని సమాచారం.

మరోవైపు  వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత రాజేందర్ రెడ్డి కూడ మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సానుకూలంగా లేరని పార్టీ నేతలకు చెప్పినట్టు తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios