Asianet News TeluguAsianet News Telugu

నల్గొండ ఎంపీ పోటీపై క్లారిటీ ఇచ్చిన కోమటిరెడ్డి

తెలంగాణలో అసెంబ్లీ, పంచాయితీ ఎన్నికలు ముగియడంతో పార్లమెంట్ ఎన్నికల వేడి మెల్లమెల్లగా మొదలవుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుండి అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయిన సీనియర్లు కొందకు పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. తాజాగా నల్గొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. 
 
Komatireddy Venkat Reddy Will be Contest As Nalgonda MP
Author
Nalgonda, First Published Feb 7, 2019, 3:53 PM IST

తెలంగాణలో అసెంబ్లీ, పంచాయితీ ఎన్నికలు ముగియడంతో పార్లమెంట్ ఎన్నికల వేడి మెల్లమెల్లగా మొదలవుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుండి అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయిన సీనియర్లు కొందకు పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. తాజాగా నల్గొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. 

నల్గొండ జిల్లా పరిధిలోని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లతో కోమటిరెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేయనున్నట్లు ప్రకటించారు. తనను ఎంపీగా గెలిపించే బాధ్యత మీపై పెడుతున్నానని కోమటిరెడ్డి సూచించారు. 

కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి  గెలుపొందిన  సర్పంచ్‌, వార్డు మెంబర్లను కోమటిరెడ్డి అభినందించారు. అలాగే ఓడిపోయిన నాయకులు నిరాశతో ధైర్యాన్ని  కోల్పోవద్దని... వారందరికి తాను అండగా వుంటానని  భరోసా ఇచ్చారు. మరోసారి టీఆర్ఎస్ పార్టీని నమ్మి మోసపోకుండా ప్రజలను చైతన్యం చేయాలని...పార్లమెంట్ ఎన్నికల నాటికి పార్టీకి  పూర్వ వైభవం తీసుకురావాలని కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి కోరారు. 

 టీఆర్ఎస్ ప్రభుత్వ గ్రామా పాలనను గాలికి వదిలేసిందని....కేంద్రం విడుదల చేసిన నిధులు కూడా గ్రామాలకు అందకుండా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. అందువల్ల సర్పంచ్ లు అప్రమత్తంగా వుండి తమ గ్రామాలకు రావాల్సిన నిధులను పోరాడి మరి రాబట్టుకోవాలని సూచించారు. గ్రామాల అభివృద్ది కోసం శక్తి వంచన లేకుండా పనిచేయాలని ఈ సందర్భంగా నూతన సర్పంచ్, వార్డు మెంబర్లకు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు.   
 
Follow Us:
Download App:
  • android
  • ios