Asianet News TeluguAsianet News Telugu

ఇగ కేసిఆర్ తో కొట్లాటే అంటున్న కోదండరాం

  • కొలువుల కై కొట్లాటకు సై అంటున్న జెఎసి
  • కేసిఆర్ మెడలు వంచుతామంటున్న జెఎసి
  • అక్టోబరు 31వ తేదీ ఖరారు
  • హైదరాబాద్ లో భారీ బహిరంగసభ కు సన్నద్ధం
kodand to  launch frontal attack on kcr for jobs

kodand to  launch frontal attack on kcr for jobs

తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరాం గట్టి నిర్ణయం తీసుకున్నారు. కేసిఆర్ సర్కారుతో కొట్లాట పెట్టుకోక తప్పదని డిసైడ్ అయ్యారు. ఆ కొట్లాట కూడా మామూలుగా కాకుండా కేసిఆర్ సర్కారుకు చెమటలు పట్టే రీతిగ పెట్టుకునేందుకు రెడీ అయితున్నడు. మరి ఈ కొట్లాట ఎట్లుంటదో అనుకుంటున్నరా? ఈ స్టోరీ చదువురి మరి.

తెలంగాణలో కేసిఆర్ సర్కారు గద్దెనెక్కి మూడేళ్లు గడుస్తున్నా ఆశించిన మేర ఉద్యోగాల నియామకాలు చేపట్టడంలేదు. తెలంగాణ వస్తే ఒకే ఒక్క దెబ్బల లక్ష కొలువులిస్తా అని నిరుద్యోగులను ఆశ పెట్టిన కేసిఆర్ తీరా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల ముచ్చట మరచిపోయిండని తెలంగాణ జెఎసి ఆరోపిస్తోంది. లక్ష ఉద్యోగాలు ఒక్క దెబ్బల అన్న పెద్ద మనిషి ఎటు పోయిండని ప్రశ్నిస్తోంది జెఎసి. నిరుద్యోగులు అడుగుతున్న ఉద్యోగాల ముచ్చట వదిలిపెట్టి గొర్లు, బర్లు, చీరలు అంటూ సర్కారు టైంపాస్ చేస్తుందని మండిపడుతోంది జెఎసి.

ఈ నేపథ్యంలో వచ్చేనెల అక్టోబరు 31 నిరుద్యోగుల అందరితో కొలువులకై కొట్లాట కు జెఎసి సై అంటోంది. తెలంగాణ మూడేళ్లవుతున్నా ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా సర్కారు కాలయాపన చేయడంపై జెఎసి అగ్గిమీద గుగ్గిలమవుతోంది. తొలి ఏడాదే లక్ష కొలువులు ఒక్క దెబ్బలనే ఇస్తనన్న మాట తప్పిన సర్కారుతో కొట్లాట కాక ఇంకెలా ఫైట్ చేయాలని ప్రశ్నిస్తోంది జెఎసి. ఏరకమైన ఉద్యోగాలు భర్తీ చేయకుండా తియ్యటి మాటలతో కాలమెల్లదీస్తున్నారని ఆగ్రహంగా ఉంది జెఎసి.

అక్టోబరులో జెఎసి తలపెట్టిన బహిరంగసభకు పేరు నిర్ణయించే బాధ్యత కూడా నిరుద్యోగులైన యువత మీదనే ఉంచింది జెఎసి. దీంతో నిరుద్యోగ సైన్యం స్పందించి కొలువులకై కొట్లాట అనే పేరును ఖరారు చేశారు. ఎక్కువ మంది ఆ పేరునే సూచించడంతో ఆ పేరుతోనే నిరుద్యోగ గర్జనకు జెఎసి సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు బాధ్యతారాహిత్యంపై సమరభేరి మోగించేందుకు జెఎసి సన్నద్ధమవుతోంది.

కొత్త రాష్ట్రం వచ్చిన వెంటనే కొత్త ఉద్యోగాలు వస్తాయనుకుంటే కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు వచ్చాయి తప్ప ఉద్యోగాలు రాలేదని యువత ఆగ్రహంగా ఉన్నారు. పోనీ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాతనైనా ఉద్యోగాల జాతర సాగుతుందేమోనని ఆశ పడ్డారు. కానీ గత దసరా నుంచి ఈ దసరా మధ్య వచ్చిన కొత్త ఉద్యోగాల ఊసే లేకుండాపోయిందని అంటున్నారు. ఉద్యమ ట్యాగ్ లైన్లలో ఒకటైన నీళ్లు, నిధులతోపాటు నియామకాల గురించి సర్కారు పట్టించుకోకపోవడం పట్ల నిరుద్యోగులు సీరియస్ అవుతున్నారు. ఉద్యోగాల ముచ్చట వదిలేసి కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ, కొత్త నిర్మాణాలు, కొత్త క్యాంపు ఆఫీసు, కొత్త భనాలు కట్టుతానంటూ సర్కారు దుర్మార్గంగా వ్యవహరిస్తోందని నిరుద్యోగులు అంటున్నారు.

ఇక జెఎసి తలపెట్టిన కొలువులకై కొట్లాట సభ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశలున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Follow Us:
Download App:
  • android
  • ios