Asianet News TeluguAsianet News Telugu

ఇది నందమూరి టీడీపీ కాదు.. నారా టీడీపీ..బాబును ప్రశ్నించండి: కిషన్‌రెడ్డి

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తెలంగాణ బీజేపీ నేత కిషన్‌రెడ్డి. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా.. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన టీడీపీ... ఇప్పుడు అదే కాంగ్రెస్ పంచన చేరుతోందని ఆయన విమర్శించారు

kishan reddy comments on chandrababu naidu
Author
Hyderabad, First Published Nov 1, 2018, 11:51 AM IST

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తెలంగాణ బీజేపీ నేత కిషన్‌రెడ్డి. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా.. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన టీడీపీ... ఇప్పుడు అదే కాంగ్రెస్ పంచన చేరుతోందని ఆయన విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం రోజునే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడం.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుడమేనని ఆరోపించారు. కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టి ఎన్నికలకు వెళ్లడం అంటే ఆంధ్రప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్లేనన్నారు.

ఎన్టీఆర్ ఆత్మ క్షోభించేలా... అధికారమే లక్ష్యంగా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడున్నది నందమూరి టీడీపీ కాదని.. నారా టీడీపీ అని ఎద్దేవా చేస్తూ.. టీడీపీ-కాంగ్రెస్ కలయికను ఎన్టీఆర్ అభిమానులు ప్రశ్నించాలని సూచించారు.

బాబుకి కావాల్సింది ఏపీ అభివృద్ధి కాదని.. తన అధికారం కాపాడుకోవడమేనని...అందుకోసమే కాంగ్రెస్‌తో పొత్తుకు వెళ్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.. మధ్యాహ్నం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోనూ.. ఇతర జాతీయ నేతలతోనూ ఆయన సమావేశమవుతారు. 

More News:

రాహుల్‌తో నేడు భేటీ: యూపీఏలోకి చంద్రబాబు

బీజేపీయేతర ఫ్రంట్‌‌ వైపు బాబు అడుగులు: 20 ఏళ్ల తర్వాత

నా మనసు క్షోభిస్తోంది.. చంద్రబాబు ఆవేదన

రాహుల్‌తో నేడు భేటీ: యూపీఏలోకి చంద్రబాబు

రాహుల్ గాంధీని కలుస్తా,జాతీయ పార్టీలను ఏకం చేస్తా:చంద్రబాబు

జగన్ కి ఫోన్ చేద్దామనుకున్నా, అందుకే చెయ్యలేదు: చంద్రబాబు
 

Follow Us:
Download App:
  • android
  • ios