Asianet News TeluguAsianet News Telugu

ఈ ఏడు ఖైరతాబాద్ గణేషుడు ఎలా ఉంటాడో తెలుసా?

ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ గణేషుడు ఈ ఏడాది సరికొత్త రీతిలో కొలువుదీరనున్నాడు. ఈసారి లంబోధరుడు 57 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకోనున్నాడు. చండీ కుమార అనంత మహాగణపతి రూపంలో విగ్రహ తయారీకి ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. గణపతికి ఎడమ వైపున మహిసాసుర మర్దిని కుడి వైపున మహాకాల సదా శివుడు దర్శనమివ్వనున్నారు.

khairatabad ganesh to be 57 feet this year

ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ గణేషుడు ఈ ఏడాది సరికొత్త రీతిలో కొలువుదీరనున్నాడు. ఈసారి లంబోధరుడు 57 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకోనున్నాడు. చండీ కుమార అనంత మహాగణపతి రూపంలో విగ్రహ తయారీకి ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. గణపతికి ఎడమ వైపున మహిసాసుర మర్దిని కుడి వైపున మహాకాల సదా శివుడు దర్శనమివ్వనున్నారు.

దేశంలోనే ఖైరతాబాద్ గణేషుడు ఎన్నో ప్రత్యేకతలు చాటుకున్నాడు. గత 63 ఏళ్ల క్రితం ఇక్కడ ఒక్క అడుగు విగ్రహంతో ప్రారంభమైన గణేషుడు ఏటా ఒక అడుగు పెరుగుతూ 60 ఏళ్ల వరకు ఆయన విగ్రహ ఎత్తు పెరుగుతూ వచ్చింది. శష్టిపూర్తి సందర్భంగా 60 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 60 ఏట శష్టిపూర్తి గణేషుడు అని సెలబ్రేషన్స్ గ్రాండ్ గా చేశారు. ఆ తర్వాత  ఏడాది నుంచి ఒక్కో ఏడు ఒక్కో అడుగు తగ్గుతూ వస్తున్నాడు. 59కి ఆ తర్వాత 58కి తన ఎత్తు తగ్గించుకున్న గణేషుడు ఈ ఏడాది 57 అడుగులకే పరిమితం కానున్నాడు.

ఈ ఎత్తు తగ్గింపు ఇలాగే కొనసాగుతుందని ఉత్సవ కమిటీ స్పష్టం చేస్తోంది. చివరికి ఒక అడుగు వరకు ఆ తగ్గింపు ఉంటుందని చెబుతున్నారు. మరో 56 ఏళ్ల తర్వాత ఖైరతాబాద్ గణేషుడు ఒక అడుగు ఎత్తులోనే దర్శనమిస్తాడు.

సో మనం ఒక్క అడుగు ఎత్తులో ఉండే ఖైతాబాద్ గణేషుడిని దర్శించుకోవాలంటే మరో ఐదు దశాబ్దాలు వేచి చూడక తప్పదు.