Asianet News TeluguAsianet News Telugu

నీటి పారుదలపై కేసీఆర్ సమీక్ష: కనిపించని హరీష్ రావు

కరీంనగర్‌ ఎంపీ బి.వినోద్‌కుమార్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి  పాల్గొన్నారు. హరీష్ రావు నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి పడిన శ్రమను కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో ప్రశంసించారు కూడా.

KCR reviews on irrigation projects without Harish
Author
Hyderabad, First Published Dec 16, 2018, 9:09 AM IST

హైదరాబాద్‌: నీటి పారుదలపై ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కనిపించలేదు. గత మంత్రివర్గంలో హరీష్ రావు నీటి పారుదల శాఖను నిర్వహించిన విషయం తెలిసిందే. పలు నీటి పారుదల ప్రాజెక్టుల పనులు ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతూ వచ్చాయి.

కరీంనగర్‌ ఎంపీ బి.వినోద్‌కుమార్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి  పాల్గొన్నారు. హరీష్ రావు నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి పడిన శ్రమను కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో ప్రశంసించారు కూడా.
 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం ప్రగతి భవన్‌లో సాగునీటి ప్రాజెక్టులపై సమగ్ర సమీక్ష నిర్వహించబోతున్నట్లు ఆయన కార్యాలయం శుక్రవారమే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే కేసీఆర్‌ తన క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌లో శనివారం సాగునీటి ప్రాజెక్టులపై దాదాపు ఏడు గంటలపాటు సమీక్ష జరిపారు.

తన తనయుడు కేటీ రామారావుకు కేసిఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టి హరీష్ రావును పూర్తిగా పక్కకు పెట్టినట్లు భావిస్తున్నారు. హరీష్ రావు స్థానంలో నీటి పారుదల శాఖను బాల్కొండ ఎమ్మెల్యే, మిషన్‌ భగీరథ మాజీ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డికి అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

ఫ్యాన్స్ ఆందోళన: హరీష్ రావుకు కేసిఆర్ మరో షాక్?

హరీష్ రావు అభిమానులతో మినిస్టర్స్ క్వార్టర్స్ జామ్ (వీడియో)

పారిన కేసీఆర్ పాచిక: భారీ మెజారిటీతో హరీష్ రావుకు షాక్

అతి పెద్ద ప్లాన్ ఇదే: నితీష్ వర్సెస్ కేసీఆర్

టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్‌ హరీష్‌కు ట్రబుల్స్: టీడీపీ, కాంగ్రెస్ మైండ్‌గేమ్

ఆధారాలున్నాయి: హరీష్ పై మరోసారి వంటేరు సంచలనం

పిచ్చి పట్టి మాట్లాడుతున్నాడు: వంటేరుకు హరీష్ కౌంటర్ (వీడియో)

రాహుల్ గాంధీతో హరీష్ టచ్ లో ఉన్నారు: వంటేరు సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్ లో హరీష్ రావు ఇష్యూ: లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

హరీష్ రావును కేసిఆర్ పార్టీ నుంచి గెంటేస్తారు: రేవంత్ రెడ్డి

సేఫ్ జోన్ లోకి కేటీఆర్: హరీష్ రావుపై కేసిఆర్ ప్లాన్ ఇదీ...

భావోద్వేగంతోనే రిట్మైర్మెంట్ కామెంట్ చేశా: మంత్రి హరీష్

హరీష్ టార్గెట్, కేటిఆర్ కు రస్తా: కేసిఆర్ ప్లాన్ ఇదీ...

కారులో హరీష్ రావు ఉక్కిరిబిక్కిరి: సిద్ధిపేటపై కేసిఆర్ కన్ను

హరీష్ వేదాంత ధోరణి: గులాబీ గూడు చెదురుతోందా?

Follow Us:
Download App:
  • android
  • ios