Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ రెడ్డి ఓటమి: మిగిలింది గుర్నాథ్‌రెడ్డికి కేసీఆర్ హామీనే

 కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకొన్నారు.కేసీఆర్‌కు తాను ఇచ్చిన హామీ మేరకు పట్నం నరేందర్ రెడ్డిని ఆ స్థానంలో గెలిపించారు.

kcr promises to gurunath reddy to mlc post
Author
Kodangal, First Published Dec 26, 2018, 3:32 PM IST


కొడంగల్: కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకొన్నారు.కేసీఆర్‌కు తాను ఇచ్చిన హామీ మేరకు పట్నం నరేందర్ రెడ్డిని ఆ స్థానంలో గెలిపించారు. ఇక కేసీఆర్ గుర్నాథ్ రెడ్డికి ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాల్సి ఉంది.

గత ఏడాది టీడీపీని వీడి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో కొడంగల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగితే రేవంత్ రెడ్డిని  ఓడించేందుకు టీఆర్ఎస్ వ్యూహత్మకంగా పావులు కదిపింది.

ఆ సమయంలో పోటీ చేసేందుకు గాను మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి ఆసక్తి చూపలేదు. దీంతో  మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి  సోదరుడు పట్నం నరేందర్ రెడ్డిని  ఈ స్థానంలో బరిలోకి దింపాలని  అప్పుడే టీఆర్ఎస్ ప్లాన్ చేసింది.

ఐదుగురు మంత్రులు కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు రూ.300 కోట్లకు పైగా అభివృద్ధి పనులను నెలల వ్యవధిలో చేపట్టారు. అయితే ఆ సమయంలో  ఉప ఎన్నికలు జరగలేదు.

అయితే ఆ సమయంలో  ఉప ఎన్నికలు జరుగుతాయనే ఉద్దేశ్యంతో  టీఆర్ఎస్ వ్యూహత్మకంగా వ్యవహరించింది. ఆ సమయంలోనే మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డికి కార్పోరేషన్ పదవిని ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ,  ఆ సమయంలో పదవి తీసుకొనేందుకు గుర్నాథ్ రెడ్డి అంగీకరించలేదు.

పట్నం నరేందర్ రెడ్డని గెలిపించిన తర్వాత తనకు పదవి ఇవ్వాలని గుర్నాథ్ రెడ్డి కేసీఆర్ ను కోరారు.  ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ స్థానం నుండి రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి  విజయం సాధించారు.

పోలింగ్ రెండురోజుల ముందు కొడంగల్ లో నిర్వహించిన టీఆర్ఎస్ సభలో మాజీ ఎమ్మెల్సీ గుర్నాథ్ రెడ్డికి ఎమ్మెల్యే హోదాకు తగిన పదవిని ఇస్తామని హామీ ఇచ్చారు.

కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఓటమి పాలు కావడంతో  గుర్నాథ్ రెడ్డికి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవిని ఇవ్వనున్నారు. త్వరలోనే గుర్నాథ్ రెడ్డికి  ఎమ్మెల్సీ పదవి దక్కనుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ముందు ఉద్దేశ్యపూర్వకంగానే గుర్నాథ్ రెడ్డి పదవి తీసుకోలేదు. నరేందర్ రెడ్డిని గెలిపించడం ద్వారా తన సత్తాను చూపిన తర్వాతే పదవి తీసుకోవాలనే పంతంతో  గుర్నాథ్ రెడ్డి పదవికి దూరంగా ఉన్నారు.

కొడంగల్ లో రేవంత్ రెడ్డిని ఓడించారు. దీంతో తన పంతాన్ని నెగ్గించుకొన్న గుర్నాథ్ రెడ్డి... తనకు ఇచ్చిన హామీని కేసీఆర్ ఎప్పుడు  నెరవేరుస్తారా అని ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

రేవంత్ రెడ్డి‌పై ఓవైసీ, కేసీఆర్ మధ్య ఆసక్తికర సంభాషణ

రేవంత్‌రెడ్డికి చెక్: అప్పుడు అన్న, ఇప్పుడు తమ్ముడు

రేవంత్‌కు కొడంగల్ దెబ్బ: కేసీఆర్ పంతం, హరీష్ వ్యూహం

రాజకీయాల నుండి తప్పుకొంటా, రెడీనా: కేటీఆర్‌కు రేవంత్ సవాల్

కేసీఆర్‌కు రెండు చోట్ల ఓట్లెలా ఉన్నాయి: రేవంత్ రెడ్డి

రేవంత్ అరెస్ట్ ఓటర్లను ప్రభావితం చేసింది: లగడపాటి

లగడపాటి ఎగ్జిట్ పోల్స్: ప్రభుత్వ వ్యతిరేకత టీఆర్ఎస్‌కు నష్టం

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ప్రజా కూటమిదే పైచేయి

లగడపాటిపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

టీఆర్ఎస్ తరపున లగడపాటి భార్య ప్రచారం

క్లూ ఇచ్చిన లగడపాటి: గజ్వేల్‌లో కేసీఆర్ డౌట్

కేటీఆర్‌కు ఆ విషయం చెప్పా, నేనేమీ మార్చలేదు: లగడపాటి

చంద్రబాబు కోసమే లగడపాటి సర్వే: కేటీఆర్ ట్వీట్

లగడపాటి సర్వే ఎఫెక్ట్: అసదుద్దీన్ తో కేసీఆర్ దోస్తీ అందుకే...

లగడపాటి అసలు సర్వే ఇదీ, నాకు పంపాడు: గుట్టు విప్పిన కేటీఆర్

లగడపాటి సర్వే సంకేతాలివే: కేసీఆర్ కు నో కేక్ వాక్

లగడపాటి సర్వే: మరో ముగ్గురు స్వతంత్రుల పేర్లు విడుదల

రేవంత్ కేసులో హైకోర్టుకు డిజిపి మహేందర్ రెడ్డి

రేవంత్ అరెస్ట్ ఎఫెక్ట్: వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణపై ఈసీ వేటు

డీజీపీ మా ముందుకు రావాలి...రేవంత్ అరెస్ట్‌పై హైకోర్టు ఆదేశం

రేవంత్ రెడ్డి అరెస్ట్: ఎందుకో రేపు చెబుతామన్న ఏజీ

దిగొచ్చిన పోలీసులు: కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలింపు

రేవంత్‌కు అస్వస్థత: వైద్యుల చికిత్స

డీజీపీకి షాక్: రేవంత్ విడుదలకు రజత్ కుమార్ ఆదేశాలు

రేవంత్ రెడ్డి అరెస్ట్: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ రెడ్డి అరెస్ట్: హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్

ఎన్నికల ఎఫెక్ట్.. గుడ్లగూబలతో నేతల క్షుద్రపూజలు

రేవంత్ అరెస్ట్ పై వంటేరు సీరియస్

రేవంత్ రెడ్డి భూముల్లో జేసీబీతో గోడ కూల్చివేత

రేవంత్ రెడ్డి అరెస్ట్: న్యాయవాది ఏమన్నారంటే...

రేవంత్ రెడ్డి అరెస్ట్‌: ముందు ఏం జరిగిందంటే?

రేవంత్‌రెడ్డి అరెస్ట్ ...కొడంగల్‌లో ఉద్రిక్తత, 144 సెక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్: జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలింపు

నా భర్తను టెర్రరిస్ట్‌ను లాక్కెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు: రేవంత్ భార్య (వీడియో)

రేవంత్ రెడ్డి అరెస్ట్..తాళాలు పగొలగొట్టి ఇంట్లోకి వెళ్లిన పోలీసులు (వీడియో)

సీఎంలు, పీఎంలు వస్తుంటే అరెస్ట్ చేయమని ఎక్కడుంది: కుంతియా

నీ కూతురి బెడ్‌రూమ్‌ బద్దలుకొడితే ఊరుకుంటావా: కేసీఆర్‌కు జైపాల్ రెడ్డి కౌంటర్

 

Follow Us:
Download App:
  • android
  • ios