Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రా రైతులు మన రైతుల గురించి మాట్లాడుకోవాలి: కేసీఆర్

ఆంధ్రా రైతులు తెలంగాణ రైతుల గురించి మాట్లాడుకునే రోజు వస్తుందన్నారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. 

KCR Praja Ashirwada Sabha aj Jukkal
Author
Jukkal, First Published Nov 28, 2018, 1:53 PM IST

ఆంధ్రా రైతులు తెలంగాణ రైతుల గురించి మాట్లాడుకునే రోజు వస్తుందన్నారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చినా తర్వాత పునర్నిర్మాణంలో భాగంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. దేశ చరిత్రలో 24 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు రైతు బంధు, రైతు బీమా పథకాల ద్వారా రైతన్నలకు చేయూతనిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు కేసీఆర్.

తాను పదవిలో ఉన్నంత వరకు ఉచిత విద్యుత్ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని గులాబీ దళపతి హామీ ఇచ్చారు. అందరికి ముస్లింల ఓట్లు కావాలి కానీ వారి సంక్షేమం అక్కర్లేదా అని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీ రెసిడెన్షియన్ పాఠశాలలను ఏర్పాటు చేశామని.. వాటిల్లో సుమారు 60 వేల మంది పిల్లలు చదువుకుంటున్నారని కేసీఆర్ తెలిపారు. సర్వేలన్నీ టీఆర్ఎస్‌దే విజయమంటున్నాయని.. 100 సీట్లు గెలుస్తామని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
 

అందరూ సీఎంలు దొబ్బితిన్నారు.. ఎన్టీఆర్‌ కూడా: కేసీఆర్

వీడని సస్పెన్ష్...గోషామహాల్ చంద్రముఖి ఏమైంది: విషయం హైకోర్టుకి

నందమూరి సుహాసినికి షాక్...ప్రచారానికి రానన్న భువనేశ్వరి

కారు ‘‘స్టీరింగ్’’ మన చేతుల్లోనే..కేసీఆర్‌‌కే ఓటేయండి : అసదుద్దీన్

తెలంగాణ ఎలక్షన్స్: 2018 ఏ పార్టీ బలమెంత (వీడియో)

Follow Us:
Download App:
  • android
  • ios