Asianet News TeluguAsianet News Telugu

గోదావరి నీరు శ్రీశైలం తరలింపు: జగన్, కేసీఆర్ నిర్ణయం

 కృష్ణా నదిలో  నీటి లభ్యత  తక్కువగా ఉన్న నేపథ్యంలో  గోదావరి నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించాలని రెండు రాష్ట్రాల సీఎంలు నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు అవసరమైన ప్లాన్‌ను తయారు చేయాలని  సీఎంలు అధికారులను ఆదేశించారు.
 

kcr, jagan decides to route godavari water into nagarjuna sagar
Author
Hyderabad, First Published Jun 28, 2019, 3:10 PM IST

హైదరాబాద్: కృష్ణా నదిలో  నీటి లభ్యత  తక్కువగా ఉన్న నేపథ్యంలో  గోదావరి నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించాలని రెండు రాష్ట్రాల సీఎంలు నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు అవసరమైన ప్లాన్‌ను తయారు చేయాలని  సీఎంలు అధికారులను ఆదేశించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల తొలి అధికారిక సమావేశం శుక్రవారం ప్రగతి భవన్ లో జరిగింది. ఏైపీ సీఎం జగన్‌తో పాటు ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, బి.రాజేంద్ర నాథ్, కురసాల కన్నబాబు, పేర్ని వెంకట్రామయ్య(నాని),  
తెలంగాణ తరుఫున ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు ఈటెల రాజెందర్, ఎస్.నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సీనియర్ ఎంపి కె.కేశవరావు, రెండు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు.

అందుబాటులో ఉన్న నీటి వనరులను సంపూర్ణంగా, సమర్థవంతంగా వినియోగించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ మూలకు సాగునీరు, మంచినీరు అందించే విషయంలో కలిసి ముందుకు సాగుతామని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

 రెండు  రాష్ట్రాల్లో వ్యవసాయానికి, తాగునీటికి, పరిశ్రమలకు నీటి కొరత రాకుండా చూడాలనే లక్ష్యంతో ఉన్నట్లు వివరించారు. నదీ జలాల వినియోగానికి సంబంధించి గతంలో ఉన్న వివాదాలను మర్చిపోయి మంచి మనసుతో రెండు రాష్ట్రాలకు ఎంత వీలయితే అంత మేలు చేసే విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని ఇద్దరు సీఎంలు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

పవర్ పాయింట్ ప్రజంటేషన్: నీటి లభ్యతపై జగన్‌కు వివరించిన కేసీఆర్
 

Follow Us:
Download App:
  • android
  • ios