Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ కేబినెట్: ఆ రెండు జిల్లాలకు విస్తరణలో దక్కని చోటు

కేసీఆర్ తన కేబినెట్‌లో ఇవాళ పదిమందికి చోటు కల్పించారు.

kcr given 10 mlas cabinet berths from 8 districts
Author
Hyderabad, First Published Feb 19, 2019, 11:09 AM IST

హైదరాబాద్: కేసీఆర్ తన కేబినెట్‌లో ఇవాళ పదిమందికి చోటు కల్పించారు. ఉమ్మడి 10 జిల్లాల్లో రెండు జిల్లాలకు మాత్రం కేసీఆర్ చోటు కల్పించలేదు. వచ్చే విడత కేబినెట్ విస్తరణలో ఈ జిల్లాలకు అవకాశం కల్పించనున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో 10 జిల్లాలు ఉన్నాయి. అయితే పరిపాలన సౌలభ్యం కోసం కేసీఆర్  ఈ 10 జిల్లాలను 31 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కేసీఆర్ మరో రెండు జిల్లాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలో భాగంగా కేసీఆర్ ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పడ్డాయి.

అయితే ఇవాళ కేసీఆర్ కేబినెట్‌లో 10 మందికి చోటు దక్కింది. ఉమ్మడి పది జిల్లాల్లో రెండు జిల్లాలు మినహా మిగిలిన ఎనిమిది జిల్లాలకు ప్రాతినిథ్యం కల్పించారు. ఈ దఫా కేబినెట్‌లో ఖమ్మం జిల్లా నుండి, మెదక్ జిల్లా నుండి ఎవరికీ చోటు దక్కలేదు.

ఈ దఫా కేబినెట్ విస్తరణలో ఖమ్మం జిల్లా నుండి టీడీపీ నుండి విజయం సాధించిన సండ్ర వెంకటవీరయ్యకు కేసీఆర్ చోటు కల్పిస్తారనే ప్రచారం సాగింది. కానీ, ఈ దఫా మాత్రం సండ్రకు మాత్రం చోటు దక్కలేదు. 

గత టర్మ్‌లో కేసీఆర్ కేబినెట్ లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఈ దఫా మాత్రం కేసీఆర్ తుమ్మలను తన మంత్రివర్గంలోకి తీసుకోలేదు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి గత టర్మ్‌లో దేవాదాయ, న్యాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డికి కేసీఆర్ చోటు కల్పించారు. గత టర్మ్‌లో కేసీర్ కేబినెట్ లో చోటు దక్కిన జోగు రామన్నకు ఈ దఫా చోటు లేకుండాపోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి గత టర్మ్‌లో కేటీఆర్, ఈటల రాజేందర్‌లకు చోటు కల్పించారు.

ఈ దఫా కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్‌కు చోటు దక్కింది. మెదక్ జిల్లా నుండి సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్నారు.ఈ దఫా మాత్రం ఈ జిల్లాకు ప్రాతినిథ్యం దక్కలేదు. ఈ జిల్లా నుండి హరీష్ రావుకు చోటు దక్కలేదు. గత టర్మ్‌లో హరీష్ రావు భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి గత టర్మ్ లో పట్నం మహేందర్ రెడ్డి కేసీఆర్ కేబినెట్ లో చోటు దక్కింది. ఈ దఫా మాత్రం మల్లారెడ్డికి చోటు దక్కింది. గత టర్మ్ లో మల్లారెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత మల్లారెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. గత ఏడాది డిసెంబర్ మాసంలో మేడ్చల్ అసెంబ్లీ స్థానం నుండి మల్లారెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.

గత టర్మ్ లో తాండూరు నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధించిన పట్నం మహేందర్ రెడ్డి  ఈ దఫా కాంగ్రెస్ అభ్యర్ధి రోహిత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో పట్నం మహేందర్ రెడ్డికి ఈ దఫా చోటు దక్కలేదు.

నల్గొండ జిల్లా నుండి గత టర్మ్ లో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డికి ఈ దఫా మరోసారి అవకాశం దక్కింది. ఈ జిల్లా నుండి గుత్తా సుఖేందర్ రెడ్డిని కూడ మంత్రివర్గంలోకి తీసుకొంటారని ప్రచారం సాగింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత  గుత్తాకు కేబినెట్ లో చోటు కల్పించే అవకాశం ఉంది.

నిజామాబాద్ జిల్లా నుండి గత టర్మ్ లో పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కింది. పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఈ దఫా స్పీకర్ గా చేశారు. దీంతో ఈ జిల్లా నుండి వేముల ప్రశాంత్ రెడ్డికి ఈ దఫా కేబినెట్ లో చోటు దక్కింది. 

మహబూబ్ నగర్ జిల్లా నుండి గత టర్మ్ లో జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలకు చోటు దక్కింది. జూపల్లి కృష్ణారావు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఈ జిల్లా నుండి శ్రీనివాస్ గౌడ్ కు చోటు కల్పించారు. 

మరో వైపు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట మొదటి నుండి ఉన్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కేబినెట్ లో చోటు కల్పించారు.వనపర్తి నుండి నిరంజన్ రెడ్డి ఈ దఫా విజయం సాధించారు. గత ఎన్నికల్లో నిరంజన్ రెడ్డి పోటీ చేసినా కాంగ్రెస్ అభ్యర్ధి చిన్నారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 

హైద్రాబాద్ జిల్లా నుండి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు చోటు కల్పించారు. గత టర్మ్ లో కూడ తలసాని శ్రీనివాస్ యాదవ్ టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా పనిచేశారు. 

సంబంధిత వార్తలు

కేసీఆర్ వ్యూహం: హరీష్‌కు కేబినెట్‌లో దక్కని అవకాశం

 

 

Follow Us:
Download App:
  • android
  • ios