Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ప్రజల మనుగడనే టిడిపి ప్రశ్నిస్తోంది...: కేసీఆర్

నూతన రాష్ట్రం తెలంగాణలో జరుగుతున్న తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తుపల్లి లో జరిగిన ప్రజా ఆశిర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తెలగు దేశంతో పాటు కాంగ్రెస్ పార్టీలను విమర్శించారు.

kcr election campaign at sattupally
Author
Sathupally, First Published Dec 3, 2018, 1:48 PM IST

నూతన రాష్ట్రం తెలంగాణలో జరుగుతున్న తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తుపల్లి లో జరిగిన ప్రజా ఆశిర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తెలగు దేశంతో పాటు కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రజలు కరెంట్ కోసం అనేక బాధలు పడ్డారని కేసీఆర్ గుర్తు చేశారు. కానీ నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కరెంట్ కష్టాలంటే ఏంటో తెలియకుండా ఉన్నారన్నారు. పర్ కెపిటా కరెంట్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని కేసీఆర్ ప్రశంసించారు.  

ఇక సొంత ఆదాయ వనరుల విషయంలో 17.17 శాతంలో ఇండియాలోనే తెలంగాణ అత్యుత్తమ స్థానంలో ఉందన్నారు. ఈ  విషయంలో చత్తీస్ ఘడ్ ఒక్కటే డబుల్ డిజిట్ తో ఉందని...మిగతా అన్ని రాష్ట్రాలు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయని కేసీఆర్ తెలిపారు. నాలుగు సంవత్సరాలు అద్భుత పద్దతిలో తెలంగాణలో అభివృద్ది జరిగిందని కేసీఆర్ అన్నారు. కరెంట్ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ కన్నా మెరుగ్గా ఉన్నామని... ఆంధ్రా బార్డర్ లో వున్న సత్తుపల్లి ప్రజలకు ప్రత్యేకంగా ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

ఇక దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేనట్లు తెలంగాణలో రైతు బంధు పథకం అమలు చేస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యున్నత సంస్థ ఐక్యరాజ్య సమితి కూడా  రైతు బంధు పథకాన్ని ప్రశంసించిందన్నారు. అలాగే రైతు భీమా ద్వారా ప్రమాదవశాత్తు మృతిచెందిన రైతు కుటుంబాలకు ఐదు లక్షలు అందించి అండగా ఉంటున్నామన్నారు. ఇలా మానవీయ కోణంలో అనేక పథకాలు ప్రవేశపెట్టినట్లు కేసీఆర్ తెలిపారు. 

సత్తుపత్తి నియోజకవర్గంలో ఇప్పటికే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతోంది. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే 365 రోజులు రెండు పంటలకు నీళ్లు అందుబాటులో ఉంటాయన్నారు.  ఇక్కడ సెంటు భూమికి కూడా నీళ్లు అందకుండా ఉండదని కేసీఆర్ హామీ ఇచ్చారు. 

సింగరేణి భూనిర్వాసితులకు మార్కెట్ రేటు ధరను చెల్లించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఇక పోడు రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 58సంవత్సరాలు  పాలించిన కాంగ్రెస్,టిపిలు ఓవైపు,  నాలుగున్నరేళ్లు పాలించిన టీఆర్ఎస్ మరోవైపు ఉంది. ఎవరికి ఓటేస్తారో మీరే నిర్ణయించుకోవాలని కేసీఆర్ సూచించారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వంలో 600 రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించామని...పది సంవత్సరాల తర్వాత ఏ దేశంతోనైనా పోటీ పడే శక్తి మన యువకుల్లో వస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. 

  తెలుగు దేశం పార్టీ తెలంగాణ ప్రజలకు అవసరం లేదని...కేవలం 13 స్థానాల్లో పోటీచేసే వారు గెలిచినా పెద్దగా లాభమేమి ఉండదన్నారు. ఆ పార్టీకి ఓటేస్తే మన వేలితో మన కంటిని పొడుచుకున్నట్లు ఉంటుందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు అడుగడుగునా అడ్డుపడుతూ మన మనుగడనే ప్రశ్నించేవారిని ఓటెయ్యెద్దని ప్రజలకు కేసీఆర్ సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios