Asianet News TeluguAsianet News Telugu

జయరామ్ హత్య: జూ.ఆర్టిస్ట్ సహా మరో 9 మంది పోలీసుల పాత్రపై ఆరా

అయితే రాకేష్ రెడ్డి ఫోన్లో సంప్రదించిన 11 మంది పోలీసులలో ఇద్దరిపై తెలంగాణ పోలీస్ శాఖ వేటు వేసిన విషయం తెలిసిందే. మరో తొమ్మిది మంది పోలీస్ ఉన్నతాధికారుల మెడపై కత్తి వేలాడుతోంది. ఇకపోతే వేటుకు గురైన ఇద్దరు పోలీస్ శాఖ ఉన్నతాధికారులను పోలీసులు గురువారం విచారించనున్నట్లు తెలుస్తోంది. 
 

jayaram murder case: 11 police officials maintain relations with accused rakesh reddy
Author
Hyderabad, First Published Feb 14, 2019, 9:21 AM IST

హైదరాబాద్: ప్రముఖ  పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. అటు తిరిగి ఇటు తిరిగి ఈ కేసు కాస్త తెలంగాణ పోలీసుల మెడకు చుట్టుకుంది. జయరామ్ హత్యను ప్రమాదంగా చిత్రీకరించాలంటూ ఖాకీలే స్కెచ్ వేసినట్లు నిందితుడు రాకేష్ రెడ్డి బట్టబయలు చేశారు. 

దీంతో ఈ కేసు ఇప్పుడు పోలీస్ శాఖను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జయరామ్ హత్య కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. హత్యకు సంబంధించి కీలక అంశాలను రాబట్టారు. జయరామ్ హత్య కేసు నిందితుడును కస్టడీలో తీసుకున్న పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. 

జయరామ్ ను హత్య చేసిన తర్వాత ప్రమాదంగా చిత్రీకరించాలంటూ పోలీసులు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. జయరామ్ ను రాకేశ్ రెడ్డి హత్య చేసిన తర్వాత 11 మంది పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్ చేసినట్లు పోలీసులు సమాచారాం సేకరించారు. 

నలుగురు ఏసీపీలు, నలుగురు సీఐలు, ముగ్గురు ఎస్సైలు రాకేష్ రెడ్డికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన తర్వాత ఈ పదకొండు మంది పోలీస్ ఉన్నతాధికారులకు రాకేష్ రెడ్డి కాల్ చేశారు. కాల్ లిస్ట్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. 

అయితే రాకేష్ రెడ్డి ఫోన్లో సంప్రదించిన 11 మంది పోలీసులలో ఇద్దరిపై తెలంగాణ పోలీస్ శాఖ వేటు వేసిన విషయం తెలిసిందే. మరో తొమ్మిది మంది పోలీస్ ఉన్నతాధికారుల మెడపై కత్తి వేలాడుతోంది. ఇకపోతే వేటుకు గురైన ఇద్దరు పోలీస్ శాఖ ఉన్నతాధికారులను పోలీసులు గురువారం విచారించనున్నట్లు తెలుస్తోంది. 

అనంతరం తొమ్మిది మందిని కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జయరామ్ హత్య అనంతరం రాకేష్ రెడ్డి మృతదేహాన్ని కారులో పెట్టి నల్లకుంట పీఎస్ కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కారులో డెడ్ బాడీ ఉండగానే రాకేష్ రెడ్డి నల్లకుంట సీఐ శ్రీనివాస్ ను కలిశారని పోలీసులు సీసీ ఫుటేజ్ లో గుర్తించారు. 

అంతేకాదు సీఐ శ్రీనివాస్ కు మర్డర్ అనంతరం 33 సార్లు రాకేష్ రెడ్డి ఫోన్ చేశారని, అలాగే ఏసీపీ మల్లారెడ్డికి కూడా 20సార్లు కాల్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వారు హత్యను ప్రమాదంగా చిత్రీకరించాలని అది ఎలాగో కూడా స్కెచ్ వేసి మరీ వివరించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 

వారి ఆలోచనలతోనే రాకేష్ రెడ్డి బీరుబాటిల్ కొనుగోలు చేసి ఆ బీరును జయరామ్ నోటిలో పోసి మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ ప్రమాదంలో చనిపోయాడని నమ్మించవచ్చు అని ప్లాన్ వేశారని పోలీసులు నిర్ధారించారు. కాగా, రాకేష్ రెడ్డికి సహకరించినవారిలో ఓ జూనియర్ ఆర్టిస్టుతో పాటు ఇద్దరు డ్రైవర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాకేష్ రెడ్డికి పూర్తి స్థాయిలోసహకరించిన శ్రీనివాస్ ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. 

ఇకపోతే ఈ కేసులో ఇప్పటి వరకు 30 మందిని పోలీసులు విచారించారు. వీరితోపాటు మరో 25 మందిని కూడా పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది. గురువారం, లేదా శుక్రవారం శిఖా చౌదరిని కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.  

ఈ వార్తలు కూడా చదవండి

జయరామ్ మృతదేహంతో హైద్రాబాద్‌లో రాకేష్ రెడ్డి చక్కర్లు

జయరామ్ హత్య కేసు: జూబ్లీహిల్స్‌కు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి

జయరామ్ హత్య కేసు: ఆర్థిక లావాదేవీలపై పోలీసుల ఆరా

జయరామ్ హత్య‌ కేసు: పోలీస్ కస్టడీకి రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ కు జయరాం హత్యకేసు నిందితులు

ఎన్నిసార్లు ఫోన్ చేసినా జయరామ్ స్పందించలేదు: పద్మశ్రీ

అలా చెప్పడంతో కీడును శంకించింది: జయరామ్ భార్య

భర్త లేకుండా తొలిసారి పెళ్లి రోజు: జయరామ్ భార్య ఆవేదన

శిఖా చౌదరే చంపించింది, దేవుడు చెప్పినా నమ్మను: జయరామ్ భార్య

ఆర్డర్ రాలేదు, మొదటి నుండి దర్యాప్తు: హైద్రాబాద్ సీపీ

జయరామ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ

పద్మశ్రీ ఫిర్యాదు: జయరామ్ హత్యకేసుపై టీ. పోలీసుల మల్లగుల్లాలు

జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్: తెలంగాణ పోలీసులను అశ్రయించిన పద్మశ్రీ

జయరామ్‌ హత్యకేసు: శిఖా చౌదరికి క్లీన్ చిట్

జయరామ్ హత్య కేసు: నిందితులను ఎలా పట్టుకొన్నారంటే

19 గంటలు నిర్భంధం: జయరామ్‌కు రాకేష్ చిత్రహింసలు

శిఖా చౌదరికి చెక్: సంస్థలపై పట్టు కోసం జయరామ్ భార్య

శిఖా చౌదరి ప్రమేయంతోనే నా భర్త హత్య : జయరామ్ భార్య

జయరామ్ హత్య కేసు:తెలంగాణ ఏపీసీపై వేటు

జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్

జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

 

Follow Us:
Download App:
  • android
  • ios