Asianet News TeluguAsianet News Telugu

బొంతు రామ్మోహన్‌తో ఇరాన్ కాన్సులేట్‌ జనరల్‌ భేటీ...

ఇరాన్ కాన్సులేట్ జ‌న‌ర‌ల్ మ‌హ్మ‌ద్ హెగ్బిన్ ఘోమి శుక్రవారం హైద‌రాబాద్ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌తో బేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో వీరు మేయర్ ను కలిశారు. ఈ సందర్భంగా న‌వంబ‌ర్ 27 నుండి 30వ తేదీ వ‌ర‌కు ఇరాన్‌లోని ముషాద్‌న‌గ‌రంలో జరిగే  భూసంబంధిత ఆర్థిక విధానాలు, మున్సిప‌ల్ పాల‌న బాధ్య‌త‌లు అనే అంశంపై నిర్వ‌హించే స‌ద‌స్సుకు హాజ‌రు కావాల్సిందిగా మేయర్ ను కోరారు. అలాగే ఇరాన్‌లోని ఇస్ఫాన్ న‌గ‌రంలో న‌వంబ‌ర్ 22,24తేదీల్లో నిర్వహించే ఇస్ఫాన్ డే ఉత్స‌వాల‌కు హాజ‌రు కావాల‌ని ఘోమి మేయ‌ర్ రామ్మోహ‌న్‌ను ఆహ్వానించారు. 
 
iran consulate general meeting with hyderabad mayor
Author
Hyderabad, First Published Nov 2, 2018, 8:45 PM IST

ఇరాన్ కాన్సులేట్ జ‌న‌ర‌ల్ మ‌హ్మ‌ద్ హెగ్బిన్ ఘోమి శుక్రవారం హైద‌రాబాద్ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌తో బేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో వీరు మేయర్ ను కలిశారు. ఈ సందర్భంగా న‌వంబ‌ర్ 27 నుండి 30వ తేదీ వ‌ర‌కు ఇరాన్‌లోని ముషాద్‌న‌గ‌రంలో జరిగే  భూసంబంధిత ఆర్థిక విధానాలు, మున్సిప‌ల్ పాల‌న బాధ్య‌త‌లు అనే అంశంపై నిర్వ‌హించే స‌ద‌స్సుకు హాజ‌రు కావాల్సిందిగా మేయర్ ను కోరారు. అలాగే ఇరాన్‌లోని ఇస్ఫాన్ న‌గ‌రంలో న‌వంబ‌ర్ 22,24తేదీల్లో నిర్వహించే ఇస్ఫాన్ డే ఉత్స‌వాల‌కు హాజ‌రు కావాల‌ని ఘోమి మేయ‌ర్ రామ్మోహ‌న్‌ను ఆహ్వానించారు. 

ఈ సంద‌ర్భంగా మేయ‌ర్ రామ్మోహ‌న్ మాట్లాడుతూ...భారతదేశంలోని హైద‌రాబాద్ న‌గ‌రం, ఇరాన్ దేశాల మ‌ధ్య కొన్ని శ‌తాబ్దాలుగా చారిత్ర‌క‌, సంస్కృతిక బంధం ఉంద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లో ఇరాన్ సంస్కృతి, జీవ‌న విధానం బ‌లంగా ఉంద‌న్నారు. ముఖ్యంగా చివ‌రి నిజాం ఉస్మాన్ అలీఖాన్ హాయంలో ఇది మ‌రింత బ‌లోపేతం అయింద‌ని బొంతు రామ్మోహ‌న్ పేర్కొన్నారు.  

iran consulate general meeting with hyderabad mayor

అనంతరం ఇరాన్ క‌న్సోలేట్ జ‌న‌ర‌ల్ మ‌హ్మ‌ద్ ఘోమి మాట్లాడుతూ... ఇరాన్‌లోని ముషాద్‌న‌గ‌రంలో ఈ నెల 27,30 తేదీల మ‌ధ్య యు.ఎన్‌.హాబిటాట్‌, మెట్రో పోలీస్‌ల ఆధ్వ‌ర్యంలో జ‌రిగే అంత‌ర్జాతీయ స‌ద‌స్సుకు హాజ‌రు కావాల‌ని ఆహ్వానించారు. అదేవిధంగా ఇస్ఫాన్ న‌గ‌రంలో జ‌రిగే ఇస్ఫాన్ డేకు హాజ‌రు కావాల్సిందిగా ఆ న‌గ‌ర మేయ‌ర్  మ‌హ్మూద్ జ‌లాలి ఆహ్వానాన్ని మేయ‌ర్ రామ్మోహ‌న్‌కు అంద‌జేశారు. 

అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రుగుతున్నందున ప్ర‌భుత్వం నుండి త‌గు అనుమ‌తి పొందాల్సి ఉంటుంద‌ని మేయ‌ర్ రామ్మోహ‌న్ క‌న్సోలేట్ జ‌న‌ర‌ల్‌కు వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా ఇరాన్ క‌న్సోలేట్ జ‌న‌ర‌ల్‌ను మేయర్ రామ్మోహ‌న్ చార్మినార్‌ను జ్ఞాపికను బ‌హూక‌రించి శాలువాతో ఘ‌నంగా స‌న్మానించారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios