Asianet News TeluguAsianet News Telugu

అందుకే రాజకీయాల్లోకి వచ్చా, తండ్రిని తల్చుకొని కన్నీళ్లు పెట్టుకొన్న సుహాసిని

నా తెలంగాణ ప్రజలకు మీ ఇంటి ఆడబిడ్డగా వస్తున్నా... నా మీద నమ్మకం ఉంచి చంద్రబాబునాయుడు ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఇచ్చారు

I will service to  people in telangana says suhasini
Author
Hyderabad, First Published Nov 16, 2018, 6:41 PM IST


హైదరాబాద్: నా తెలంగాణ ప్రజలకు మీ ఇంటి ఆడబిడ్డగా వస్తున్నా... నా మీద నమ్మకం ఉంచి చంద్రబాబునాయుడు ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.ప్రజల అందరి అశీస్సులు కావాలని కోరారు. తన తండ్రి హరికృష్ణను గుర్తు చేసుకొని ఒకానొక దశలో ఆమె  కన్నీళ్లు పెట్టుకొన్నారు.

శుక్రవారం రాత్రి ఆమె హైద్రాబాద్‌లోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలకు సేవ చేసేందుకు మా తాత ఎన్టీఆర్  టీడీపీని స్థాపించారు. ఎన్టీఆర్  పార్టీని స్థాపించిన సమయంలో ఎన్టీఆర్ చైతన్యరథ సారథిగా మా తండ్రి  పనిచేశారని ఆమె గుర్తు చేశారు.  

చిన్నప్పటి నుండి తనకు రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఉందన్నారు. తాను రాజకీయాల్లోకి రావడానికి  కుటుంబంలోని అందరి ఆమోదం ఉందని ఆమె చెప్పారు. నాకు తన తండ్రి, తాత , చంద్రబాబుల నుండి  స్పూర్తిగా తీసుకొన్నట్టు తెలిపారు.

తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను ముందుకు వచ్చినట్టు చెప్పారు. నందమూరి కుటుంబం నుండి  పోటీ చేసే అవకాశం తాత తర్వాత తనకు రావడం పట్ల గర్వంగా పీలవుతున్నట్టు చెప్పారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత  అన్ని విషయాలు మాట్లాడుతానని ఆమె చెప్పారు. తనకు చంద్రబాబునాయుడు  మామ అవకాశం కల్పించారని చెప్పారు. 

పార్టీ కోసం, ప్రజల కోసం ఎంతవరకైనా రాత్రి పగలు అని చూడకుండా ప్రజల సేవ కోసం పనిచేస్తానని ఆమె చెప్పారు.అంతకుముందు హరికృష్ణ సోదరుడు   మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసేందుకు ఎన్టీఆర్ పార్టీని ఏర్పాటు చేస్తే.. హరికృష్ణ రథసారథిగా పార్టీ కోసం కష్టపడ్డాడని చెప్పారు. 

తమ కుటుంబం  నుండి సుహాసిని పోటీ చేసేందుకు  రావడం పట్ల ఆయన  హర్షం వ్యక్తం చేశారు. తమ కుటుంబంలోని అందరి ఆమోదంతోనే సుహాసిని  బరిలోకి దిగుతున్నారని ఆమె చెప్పారు.

ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేయాలని తన చిన్నతనంలో తాత, తన తండ్రి చెప్పేవారమని ఆమె గుర్తు చేసుకొన్నారు.ఈ మాటలను స్పూర్తిగా చేసుకొని తాను   రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలిపారు. 
 


 

సంబంధిత వార్తలు

హరికృష్ణ సానుభూతి, ఎన్టీఆర్ ఛరిష్మా: టీడీపీ తురుపుముక్క సుహాసిని

నందమూరి సుహాసినీపై.. మిత్రపక్షం కాంగ్రెస్ తిరుగుబాటు

కూకట్‌పల్లి సుహాసినికి కేటాయింపు: బాబు వద్దకు పెద్దిరెడ్డి

మీడియా ముందుకు నందమూరి సుహాసిని

33 ఏళ్ల తర్వాత తెలంగాణలో నందమూరి ఫేటు ఎలా ఉందో, నాడు ఎన్టీఆర్...నేడు సుహాసిని

‘‘ఆ’’ సాయమే హరికృష్ణ కుమార్తె సుహసిని మనసు మార్చిందా..?

హరికృష్ణ కుమార్తెకే కూకట్ పల్లి టిక్కెట్, 17న సుహాసిని నామినేషన్

సుహాసిని కోసం జూ.ఎన్టీఆర్: ప్రచారానికి బాలయ్య, విజయశాంతి జోడి

చంద్రబాబుతో భేటీ: కూకట్‌పల్లి సీటు హరికృష్ణ కూతురు సుహాసినికే

తెరపైకి హరికృష్ణ కూతురి పేరు: కూకట్‌పల్లిపై ఉత్కంఠ

హరికృష్ణ కూతురు పోటీకి జూ.ఎన్టీఆర్ బ్రేక్

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె..?

 

Follow Us:
Download App:
  • android
  • ios