Asianet News TeluguAsianet News Telugu

ఆ మీడియా అధిపతుల పేర్లు వెల్లడిస్తా: లగడపాటి సర్వే‌పై కేటీఆర్

డిసెంబర్ 11వ తేదీ తర్వాత సర్వే రిపోర్టులు మార్చేసిన  ఇద్దరు మీడియా అధిపతుల పేర్లను బయట పెట్టనున్నట్టు  తెలంగాణ  రాష్ట్ర అపద్ధర్మ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

I will reveal two media house owners names after dec 11 says ktr
Author
Hyderabad, First Published Dec 6, 2018, 8:52 AM IST

హైదరాబాద్: డిసెంబర్ 11వ తేదీ తర్వాత సర్వే రిపోర్టులు మార్చేసిన  ఇద్దరు మీడియా అధిపతుల పేర్లను బయట పెట్టనున్నట్టు  తెలంగాణ  రాష్ట్ర అపద్ధర్మ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

బుధవారం నాడు మంత్రి కేటీఆర్  మీడియాతో చిట్ చాట్ చేశారు. నవంబర్ 20వ తేదీ నాటికి సర్వే పూర్తయిందన్నారు.ఈ సర్వేలో టీఆర్ఎస్ 65 నుండి 70 సీట్లలో విజయం సాధిస్తోందని  ఈ సర్వే తేల్చిందన్నారు. ఇతరులు ఒకటి రెండు చోట్ల విజయం సాధిస్తారని ఈ సర్వే రిపోర్టు చెప్పిందన్నారు. కానీ ఆ తర్వాత చంద్రబాబునాయుడు, ఇద్దరు మీడియా అధిపతులు  లగడపాటి రాజగోపాల్‌తో సమావేశమయ్యారని  కేటీఆర్ చెప్పారు.

సర్వే నివేదిక మార్చాలని ఒత్తిడి చేశారని కేటీఆర్ తెలిపారు. నవంబర్ 20వ తేదీ తర్వాత సర్వే చేయలేదని లగడపాటి రాజగోపాల్ చెప్పారని కేటీఆర్ గుర్తు చేస్తూ మరి సర్వే ఫలితాలు ఎలా  మారాయని  మంత్రి ప్రశ్నించారు. మిత్రులెవరో, శత్రువులెవరో తనకు తెలిసిందన్నారు. ఆకస్మాత్తుగా న్యూస్ పేపర్లు కలర్లను మార్చేశాయన్నారు.

గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు బాబు కుట్ర చేశారన్నారు. ఆ సమయంలో కూడ ఆ మీడియా సంస్థలు కూడ వారికి అండగా నిలిచాయన్నారు. డిసెంబర్ 11వ తేదీ తర్వాత ఆ మీడియా అధిపతులు ఎవరనే విషయాన్ని తాను చెబుతానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

లగడపాటికి చిలకలు పంపుతా, జోస్యం చెప్పుకోవాలి: కేటీఆర్ సెటైర్లు

టీడీపీతో పొత్తుకు లగడపాటి యత్నం: కేటీఆర్ సంచలనం

క్లూ ఇచ్చిన లగడపాటి: గజ్వేల్‌లో కేసీఆర్ డౌట్

కేటీఆర్‌కు ఆ విషయం చెప్పా, నేనేమీ మార్చలేదు: లగడపాటి

చంద్రబాబును వదులుకోవద్దని కేటీఆర్‌కు చెప్పా: లగడపాటి

చంద్రబాబు కోసమే లగడపాటి సర్వే: కేటీఆర్ ట్వీట్

లగడపాటి సర్వే ఎఫెక్ట్: అసదుద్దీన్ తో కేసీఆర్ దోస్తీ అందుకే...

లగడపాటి అసలు సర్వే ఇదీ, నాకు పంపాడు: గుట్టు విప్పిన కేటీఆర్

లగడపాటి సర్వే సంకేతాలివే: కేసీఆర్ కు నో కేక్ వాక్

లగడపాటి సర్వే: మరో ముగ్గురు స్వతంత్రుల పేర్లు విడుదల

Follow Us:
Download App:
  • android
  • ios