Asianet News TeluguAsianet News Telugu

ఈఎస్ఐ స్కామ్ ఉచ్చులో నాయిని అల్లుడు: నాకేపాపం తెలీదన్న శ్రీనివాస్ రెడ్డి

మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి అల్లుడు పేరు తెరపైకి వచ్చింది. ఈఎస్ఐ కార్మిక నేతగా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ రెడ్డి సూచించిన కంపెనీల నుంచే ఔషధాలు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 

i dont know who is devika rani says ex deputy cm nayini son in law srinivasareddy
Author
Hyderabad, First Published Sep 27, 2019, 5:04 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈఎస్ఐ డైరెక్టర్ దేవీకారాణితో మెుదలైన వ్యహారం అనేక పుంతలు తొక్కుతోంది. ఏకంగా ఐఏఎస్ అధికారి మెడకు చుట్టుకుంది. 

అంతేకాదు రాజకీయ రంగు కూడా పులుముకుంటోంది. మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి అల్లుడు పేరు తెరపైకి వచ్చింది. ఈఎస్ఐ కార్మిక నేతగా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ రెడ్డి సూచించిన కంపెనీల నుంచే ఔషధాలు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 

అయితే ఔషధాల స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏసీబీ నోటీసులు ఇస్తే విచారణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తనపై ఆరోపణలు చేసిన వ్యక్తులపై చట్టపరంగా ముందుకు వెళ్తానని తెలిపారు. 

తనకు గానీ తన బంధువులకు గానీ ఫార్మా కంపెనీలు లేవన్నారు. రాంనగర్ కార్పొరేటర్‌ను మాత్రమేనని చెప్పుకొచ్చారు. దేవికారాణితో హోటల్‌లో సమావేశమైనట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దేవికారాణిని ఏనాడు కలవలేదని చెప్పుకొచ్చారు. 

కార్మిక సంఘం నేతగా ఉన్నానే తప్ప ఏనాడు ఈఎస్ఐ వ్యవహారాలు చూడలేదని చెప్పుకొచ్చారు. నాయిని అల్లుడిగా ప్రజాసేవ చేశానే తప్ప షాడో మంత్రిగా వ్యవహరించలేదన్నారు. తనపై ఎలాంటి విచారణ అయినా చేసుకోవాలని స్పష్టం చేశారు. తాను దోషినని తేలితే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నట్లు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఈఎస్ఐ స్కామ్ పై సీఎం కేసీఆర్ సీరియస్

ఈఎస్ఐ స్కాం: దేవికా రాణితో పాటు ఏడుగురికి రిమాండ్

ఈఎస్ఐ కుంభకోణం: శశాంక్ గోయల్‌‌ మెడకు చుట్టుకున్న స్కాం......
వైద్య పరీక్షల కోసం దేవికా రాణితో పాటు ఏడుగురు ఉస్మానియాకు తరలింపు......
 ఈఎస్ఐ మందుల స్కాం... దేవికా రాణి అరెస్ట్.....
.
 
 
 

Follow Us:
Download App:
  • android
  • ios