Asianet News TeluguAsianet News Telugu

న్యూజిలాండ్ కాల్పుల్లో హైదరాబాదీకి గాయాలు...పరామర్శించి టీఆర్ఎస్ నాయకులు (వీడియో)

న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ నగరంలో ఓ ఆగంతకుడు శుక్రవారం నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిని హైదరాబాద్ వాసి ఇక్బాల్ జహంగీర్(49) కుటుంబాన్ని మేయర్ బొంతు రామ్మోహన్, టీఆర్ఎస్ అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న వారు కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని ఇక్బాల్ కుటుంబానికి వారు హామీ ఇచ్చారు. 

Hyderabad man injured in New Zealand mosque attack
Author
Hyderabad, First Published Mar 16, 2019, 9:05 AM IST

న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ నగరంలో ఓ ఆగంతకుడు శుక్రవారం నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిని హైదరాబాద్ వాసి ఇక్బాల్ జహంగీర్(49) కుటుంబాన్ని మేయర్ బొంతు రామ్మోహన్, టీఆర్ఎస్ అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న వారు కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని ఇక్బాల్ కుటుంబానికి వారు హామీ ఇచ్చారు. 

15 ఏళ్ల క్రితం ఉపాధి నిమిత్తం న్యూజిలాండ్‌ కు వెళ్ళిన జహంగీర్  అక్కడే స్థిరపడ్డాడు. మొదట్లో కొన్ని రోజులు వేరు వేరు పనులు చేసిన అతడే అనంతరం సొంతంగా భావర్చి పేరుతో  ఓ హోటల్ ను నిర్వహిస్తున్నాడు. జహంగీర్ తరచూ హైదరాబాద్ కు వస్తూ కుటుంబ సభ్యులను కలిసేవాడు. ఇలా రెండు నెలల క్రితం రెండు సార్లు హైదరాబాద్ కు వచ్చాడు.  

అయితే శుక్రవారం జహంగీర్ ఎప్పటిలాగే ప్రార్థన నిమిత్తం స్థానికంగా వున్న మసీదుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే ఓ దుండగుడు తుపాకితో మసీదులోకి ప్రవేశించి అక్కడున్నవారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో జహంగీర్ శరీరంలోకి కూడా బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో తీవ్రంగా గాయపడిని అతడి పరిస్థితి నిలకడగా వుందని...ఆదివారం శస్త్ర చికిత్స చేయనున్నట్లు డాక్టర్లు తెలిపారని న్యూజిలాండ్ అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 

ఇప్పటికు హైదరాబాద్ ఎంపీ అభ్యర్థన మేరకు ఇక్బాల్ కుటుంబ సభ్యులకు సాయం చేయడానికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. అతడికి సాయంగా వుండేందుకు హైదరాబాద్ నుండి న్యూజిలాండ్ కు వెళ్లాలనుకున్న సోదరుడు ఇక్బాల్ కు వీసా ఇప్పించడం కోసం హైకమీషన్ తో మాట్లాడినట్లు కేటీఆర్ తెలిపారు. అంతేకాకుండా ఇంకా ఎలాంటి సాయానికైనా సిత్తమేనని కేటీఆర్ జహంగీర్ కుటుంబానికి హామీ  ఇచ్చారు. ఈ క్రమంలోని వారిని మేయర్, ఎమ్మెల్యే పరామర్శించారు. 

వీడియో

"

Follow Us:
Download App:
  • android
  • ios