Asianet News TeluguAsianet News Telugu

మ్యాన్‌హోల్‌లో నాలుగేళ్ల చిన్నారి: 15 నిమిషాల్లో రక్షించిన స్థానికులు

హైద్రాబాద్‌ గౌలిగూడలోని  డ్రైన్‌లో నాలుగేళ్ల చిన్నారి పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు 15 నిమిషాల్లోనే ఆ చిన్నారిని రక్షించారు. 
 

Hyderabad: Girl falls in manhole while playing; rescued within 15 minutes
Author
Hyderabad, First Published Apr 22, 2019, 1:36 PM IST

హైదరాబాద్: హైద్రాబాద్‌ గౌలిగూడలోని  డ్రైన్‌లో నాలుగేళ్ల చిన్నారి పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు 15 నిమిషాల్లోనే ఆ చిన్నారిని రక్షించారు. 

హైద్రాబాద్‌ గౌలిగూడలో నాలుగేళ్ల చిన్నారి దివ్య తన అక్క నలుగురు స్నేహితురాళ్లతో కలిసి  ఇంటికి టిఫిన్ తీసుకెళ్లేందుకు హోట‌ల్‌కు  వెళ్తున్న సమయంలో  డ్రైన్‌లో పడిపోయింది.  ఈ విషయాన్ని స్థానికులు వెంటనే  ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం ఇచ్చారు.  

ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు స్థానికులతో కలిసి రెస్క్యూ ఆపరేషన్  చేపట్టారు. 15 నిమిషాల్లోనే చిన్నారిని  సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఫైర్ కానిస్టేబుల్ క్రాంతికుమార్ చిన్నారి కోసం 12 అడుగుల లోతులో ఉన్న మ్యాన్ హోల్‌లోకి దిగాడు. 

 ఆ చిన్నారి కోసం పెద్దగా అరిచాడు. అయితే ఆ చిన్నారి ఏడుపు విన్పించింది. దీంతో అక్కడికి చేరుకొని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు.డ్రైన్ లోపల ఉన్న చెత్త ఉండడం వల్లే  చిన్నారికి వరంగా మారిందని ఫైర్  ఆఫీసర్ రాజ్‌కుమార్ చెప్పారు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios