Asianet News TeluguAsianet News Telugu

ఇందిరాపార్క్ వద్ద ఆర్టీసీ జేఎసీ దీక్షలు: అనుమతి ఇవ్వని పోలీసులు

ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఇందిరాపార్క్ వద్ద సోమవారం నాడు తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీక్ష కోసం వచ్చిన వారిని అరెస్ట్ చేస్తామని  పోలీసు శాఖ ప్రకటించింది.

Hyderabad City police denied permission to RTC JAC protest at dharna chowk in Indira Park on Monday
Author
Hyderabad, First Published Oct 7, 2019, 7:24 AM IST

హైదరాబాద్: తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం నాడు ఆర్టీసీ కార్మికులు ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన నిరహారదీక్షకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. ఇందిరాపార్క్ వద్దకు వచ్చిన వారిని అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. మరో వైపు తాము దీక్షను కొనసాగిస్తామని ఆర్టీసీ జేఎసీ ప్రకటించింది.

ఇందిరాపార్క్ వద్ద తాము తలపెట్టిన నిరహారదీక్షకు మద్దతివ్వాలని పలు రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలను ఆర్టీసీ జేఎసీ కోరింది. ఈ మేరకు ఆయా పార్టీలు, ప్రజా సంఘాలు ఆర్టీసీ జేఎసీకి మద్దతుగా నిలిచాయి.

సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులను తొలగిస్తున్నట్టుగా సీఎం కేసీఆర్ ఆదివారం నాడు రాత్రి ప్రకటించారు. దీంతో సోమవారం నాడు ఇందిరాపార్క్ వద్ద ఆర్టీసీ జేఎసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరహారదీక్షకు దిగనున్నారు.

ఇందిరా పార్క్ వద్ద దీక్షకు పోలీసులు అనుమతిని నిరాకరించారు.ఈ పరిస్థితుల్లో దీక్ష కొనసాగిస్తామని జేఎసీ ప్రకటించడంతో పోలీసులు భారీగా పోలీసులను మోహరించారు.

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించడాన్ని పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఆర్టీసీ కార్మికులకు సంఘీభావాన్ని తెలిపాయి. దీంతో ఇందిరాపార్క్ వద్ద దీక్ష ఎలా సాగుతోందనే ఉత్కంఠ నెలకొంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios