Asianet News TeluguAsianet News Telugu

మైనర్ బాలికపై ఓలా క్యాబ్ డ్రైవర్ రేప్

మంగళవారం తన పుట్టిన రోజు అని చెప్పి.. పార్టీకి తన ఇంటికి రావాల్సిందిగా బాలికను ఆహ్వానించాడు.

Hyderabad: Cab driver rapes minor, arrested
Author
Hyderabad, First Published Nov 29, 2018, 11:44 AM IST

మైనర్ బాలికపై ఓలా క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ క్యాబ్ డ్రైవర్ ని అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... రెయిన్ బజార్ కి చెందిన 16ఏళ్ల బాలిక స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కాగా.. అదే ప్రాంతానికి చెందిన అస్లాం అనే యువకుడు..  ఓలా క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మంగళవారం తన పుట్టిన రోజు అని చెప్పి.. పార్టీకి తన ఇంటికి రావాల్సిందిగా బాలికను ఆహ్వానించాడు.

మంగళవారం సాయంత్రం 4గంటల సమయంలో బర్త్ డే పార్టీకి అని ఇంట్లో చెప్పి వెళ్లిన బాలిక.. రాత్రి పది దాటినా ఇంటికి రాలేదు. దీంతో.. ఆమె కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. అయితే.. అస్లాం బర్త్ డే పార్టీ అని చెప్పి.. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  బాలికను వెతుకుతున్న క్రమంలో అస్లాం ఇంటికి ఆమె తల్లిదండ్రులు వెళ్లారు.

అక్కడే ఉన్న కూతురిని అస్లాం చెర నుంచి రక్షించి..పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి.. విచారిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios