Asianet News TeluguAsianet News Telugu

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఎఫెక్ట్: సర్పంచుల సంఘం అధ్యక్షుడు మిస్సింగ్?

చలో హుజూర్ నగర్ కార్యక్రమం నేపథ్యంలో హుజూర్ నగర్ కు బయలుదేరిన తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు సౌదాని భూమన్న యాదవ్ అదృశ్యమయ్యారు. ఆయన ఏమయ్యారనేది అంతు చిక్కడం లేదు.

Huzur nagar bypoll effect: Sarpanches association president missing
Author
Suryapet, First Published Sep 28, 2019, 10:00 AM IST

సూర్యాపేట: హుజూర్ నగర్ ఉప ఎన్నికలో పెద్ద యెత్తున నామినేషన్లు దాఖలు చేయాలనే నిర్ణయం నేపథ్యంలో సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సౌదాని భూమన్న యాదవ్ కనిపించకుండా పోయారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం చలో హుజూర్ నగర్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. 

అందులో భాగంగా సంఘం రాష్ట్రాధ్యక్షుడు సౌదాని భూమన్న యాదవ్ శుక్రవారం హైదరాబాదు నుంచి హుజూర్ నగర్ కు బయలుదేరారు. ఆ విషయాన్ని ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడికి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. 

శుక్రవారం సాయంత్రం దాదాపు 5 గంటల సమయంలో ఓ స్తానిక నేతకు భూమన్న ఫోన్ చేశారు. టోల్ గేట్ వద్ద తమను పోలీసులు అరెస్టు చేస్తున్నారని ఫోన్ చేసి చెబుతుండగానే ఫోన్ కట్ అయింది. ఆ తర్వాత ఆయన ఫోన్ స్విచ్ఛాప్ లోనే ఉంది. ఆ విషయాన్ని సూర్యాపేట జిల్లా కార్యకర్తలకు చేరవేశారు. 

దాంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని హైదరాబాద్ జాతీయ రహదారి మీద ఉన్న పంతంగి, కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద స్థానిక నాయకులు ఆరా తీశారు. మిర్యాలగుడా, కోదాడ రహదారిలోని చిల్లేపల్ిల టోల్ గేట్ వద్ద కూడా గాలించారు. భూమన్న జాడ కనిపించలేదు.  

మరిన్ని వార్తలు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక... బరిలో 251మంది సర్పంచులు...

హుజూర్ నగర్ పై చంద్రబాబు మంతనాలు: ఉత్తమ్ కు షాక్?

హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు: బీజేపీ అభ్యర్ధి డాక్టర్ రామారావు

కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు షాక్: హుజూర్‌నగర్ బరిలో 30 మంది లాయర్లు..

ట్రక్కు లేకపోతే ఉత్తమ్ అప్పుడే ఓడిపోయేవారు: కేటీఆర్

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్ధి ఈమెనే

గెలుపు మనదే,50 వేల మెజారిటీ రావాలి: సైదిరెడ్డితో కేసీఆర్

హుజూర్ నగర్ చాలా హాట్ గురూ..: కేసీఆర్ కు సవాల్ ఇదే...

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: బిజెపిలోకి కాసోజు శంకరమ్మ?

హుజూర్‌నగర్ బైపోల్: సీపీఐ, జనసేన మద్దతుకు ఉత్తమ్ ప్రయత్నాలు

సైదిరెడ్డి స్థానీయత: ఉత్తమ్ ప్రకటనలోని ఆంతర్యం ఇదే...

శానంపూడి సైదిరెడ్డి ఆంధ్రవాడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి భాష్యం అదే

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే

హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Follow Us:
Download App:
  • android
  • ios