Asianet News TeluguAsianet News Telugu

మంచిర్యాల పరువు హత్య: నా భార్య జీనియస్....లక్ష్మీరాజం

పరువు హత్యకు గురైన పిండి అనురాధ చదువులో ఎప్పుడూ ముందు ఉండేదని ఆమె భర్త లక్ష్మీరాజం చెప్పాడు. తాము హైదరాబాద్ లో చదువుకుంటున్న రోజుల్లో ప్రేమించుకున్నామని ఎప్పుడూ చదువులో ముందుండే తన భార్య హత్యకు గురవ్వడం తట్టుకోలేకపోతున్నానని కన్నీరుమున్నీరవుతున్నాడు. 

honour killing: laxmirajam says anuradha too intelligent
Author
Manchiryal, First Published Dec 24, 2018, 2:13 PM IST

మంచిర్యాల: పరువు హత్యకు గురైన పిండి అనురాధ చదువులో ఎప్పుడూ ముందు ఉండేదని ఆమె భర్త లక్ష్మీరాజం చెప్పాడు. తాము హైదరాబాద్ లో చదువుకుంటున్న రోజుల్లో ప్రేమించుకున్నామని ఎప్పుడూ చదువులో ముందుండే తన భార్య హత్యకు గురవ్వడం తట్టుకోలేకపోతున్నానని కన్నీరుమున్నీరవుతున్నాడు. 

తమ ఇద్దరిది ఒకే గ్రామం అని అయితే కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదన్నారు. దీంతో 2018 డిసెంబర్ 3న హైదరాబాద్‌ లోని ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నట్లు తెలిపాడు. పెళ్లైనప్పటి నుంచి తాము వరంగల్ లో ఉన్నామని అయితే శనివారం ఉదయం స్వగ్రామానికి వచ్చినట్లు చెప్పుకొచ్చారు.   

తాము గ్రామానికి వచ్చిన విషయం తెలుసుకున్న అనూరాధ తండ్రి సత్తన్న, తల్లి లక్ష్మి, అన్నయ్య, మరికొందరు బంధువులు అదే రాత్రి తమ ఇంటిపై దాడికి దిగారన్నారు. ఇంట్లో చొరబడి అనురాధను జుట్టు పట్టుకుని కర్రలతో కొడుతూ ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని ఆరోపించాడు.  

అయితే కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లడంతో తనకు అనుమానం వచ్చి అదే రోజు రాత్రి 11 గంటలకు జన్నారం ఠాణాలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు వచ్చి చూడగా సత్తన్న ఇంటికి తాళం వేసి ఉండటంతో వారంతా వెనుదిరిగినట్లు తెలిపారు. అయితే ఉదయానికల్లా ఘోరం వెలుగుచూసిందని బోరున విలపించాడు. 

తాము నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నామని లక్ష్మీరాజ్ తెలిపారు. ఇద్దరం బాగా చదువుకున్నాం కాబట్టి తల్లిదండ్రుల అంగీకారం లేకపోయినా, మద్దతు లేకపోయినా కలిసి బతుకుదాం అని అనురాధ చెప్పిందని తెలిపారు. తనకు ఎట్టిపరిస్థితుల్లో ఉద్యోగం వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేసిందని చెప్పాడు. 

ఆమె డైట్ పూర్తి చేసిందని త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయ్యిందన్నారు. ఇటీవలే రాసిన డీఎస్సీ పరీక్షలో ఎస్జీటీకి ఎంపికైనట్లు తెలిపారు. అందులో భాగంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తి చేసినట్లు చెప్పాడు. 

తన కోసం ఉద్యోగాన్ని సైతం వదులుకుంటానని తనతో ఉంటే తాను ఎప్పుడూ సంతోషంగా ఉంటానని పదేపదే చెప్పిందని గుర్తు తెచ్చుకుని బోరున విలపించాడు. తాను బతికి ఉంటే ఎస్జీటీ ఉద్యోగం సాధించేదని తెలిపాడు. జిల్లా వ్యాప్తంగా 416 ర్యాంకు సాధించిందని లక్ష్మణ్ అలియాస్ లక్ష్మీరాజం చెప్తున్నాడు.

ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తన లక్ష్యం అంటూ ఉండేదని అలాంటి ఆమె కోరిక తీరకుండానే చంపేశారంటూ వాపోయాడు. ఆమె బతికి ఉంటే తాము ఎంతో సంతోషంగా బతికేవాళ్లమని కానీ ఇలా చంపేస్తారని తాను ఊహించలేదన్నారు. కానీ అనురాధ ఊహించిందని అందుకే సెల్ఫీ వీడియో తీసుకుందని ఆమె భయపడినట్లుగానే జరిగిందని కన్నీరుమున్నీరయ్యాడు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

పరువు హత్య : చంపేస్తారని ఊహించలేదంటున్న భర్త లక్ష్మీరాజం

పరువు హత్య: మా నాన్నదే బాధ్యత: అనురాధ సెల్ఫీ వీడియో

పరువు హత్య:లవ్ మ్యారేజీ చేసుకొన్న కూతురును చంపిన పేరేంట్స్

ప్రణయ్ కాంస్య విగ్రహం: అమృతకు అందించిన తమిళనాడు దంపతులు

ప్రణయ్ హత్య నిందితులపై పీడీ యాక్ట్

ప్రణయ్ ఆత్మతో మాట్లాడిస్తాం: అమృత ఏం చేసిందంటే...

అమృతను కించపరుస్తూ కామెంట్...యువకుడు అరెస్ట్

అసభ్యకరమైన పోస్టులు.. పోలీసులకు అమృత ఫిర్యాదు

పోలీసులపై అనుమానం వ్యక్తం చేసిన ప్రణయ్ తండ్రి

 

Follow Us:
Download App:
  • android
  • ios