Asianet News TeluguAsianet News Telugu

సింధుశర్మ ఒడికి చేరిన రిషిత, వశిష్ట వద్ద రెండు రోజులు: హైకోర్టు

రిటైర్డ్ జడ్డి నూతి రామ్మోహన్ రావు కోడలు సింధుశర్మకు పెద్ద కూతురు రిషితను అప్పగించాలని హైకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
 

high court orders to vashishta to give rishitha her mother
Author
Hyderabad, First Published May 2, 2019, 1:36 PM IST

హైదరాబాద్: రిటైర్డ్ జడ్డి నూతి రామ్మోహన్ రావు కోడలు సింధుశర్మకు పెద్ద కూతురు రిషితను అప్పగించాలని హైకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

రిటైర్డ్ జడ్జి నూతి రామ్మోహన్ రావు కోడలు సింధు శర్మ  పెద్ద కూతురును తన భర్త  నుండి తనకు అప్పగించాలని కోరుతూ హైకోర్టులో  బుధవారం నాడు పిటిషన్ దాఖలు చేసింది. 

ఈ పిటిషన్‌పై గురువారం నాడు హైకోర్టు విచారణ జరిపింది. రిటైర్డ్ జడ్జి రామ్మోహన్ రావు కొడుకు వశిష్ట వద్ద  సింధు శర్మ పెద్ద కూతురు  రిషిత ఉంటుంది.  తన కూతురును అప్పగించాలని ఆమె హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయమై హైకోర్టు గురువారం నాడు విచారించింది.

వారానికి రెండు రోజుల పాటు  పెద్ద కూతురును తండ్రి వద్ద ఉంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి శుక్రవారం సాయంత్రం రిషితను తండ్రి వశిష్టకు అప్పగించాలని సోమవారం నాడు సింధు శర్మ తీసుకెళ్లాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 ఈ ఏడాది జూన్ 4వ తేదీ వరకు ఈ ప్రక్రియను కొనసాగించాలని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  సింధు శర్మ ఆమె భర్త వశిష్ట మధ్య గొడవలున్నాయి. ఈ తరుణంలో విడాకులు  కావాలని వశిష్ట కోరుతున్నారు.  తన తల్లి వద్దే ఉంటానని రిషిత చెప్పడంతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకొంది. అయితే తాను విడాకులు ఇచ్చేందుకు సిద్దంగా లేనని  ఇవాళ జరిగిన విచారణ సందర్భంగా కోర్టుకు సింధుశర్మ చెప్పారని  సమాచారం

Follow Us:
Download App:
  • android
  • ios