Asianet News TeluguAsianet News Telugu

శారదా పీఠానికి భూమి...కేసీఆర్ కి షాకిచ్చిన హైకోర్టు

రంగారెడ్డి జిల్లా కోకాపేట సర్వే నెంబర్‌ 240లో శారదా పీఠానికి భూమి కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన వీరాచారి దాఖలు చేసిన పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది.

high court notices to telangana government over sarada peetam land issue
Author
Hyderabad, First Published Oct 1, 2019, 8:03 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి హైకోర్టు షాకిచ్చింది. విశాఖ శారదా పీఠానికి హైదరాబాద్ నగర శివారులో ఎకరం ధర రూపాయి చొప్పున 2 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

రంగారెడ్డి జిల్లా కోకాపేట సర్వే నెంబర్‌ 240లో శారదా పీఠానికి భూమి కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన వీరాచారి దాఖలు చేసిన పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది.

పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని సీఎస్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, హెచ్‌ఎండీఏ ఎండీ, శారదా పీఠం ధర్మాధికారి జి.కామేశ్వరశర్మలకు నోటీసులు జారీ చేసింది. ధర్మకర్తగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం ఇలా భూములివ్వడం చెల్లదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. విచారణ 4 వారాలకు వాయిదా పడింది.   

Follow Us:
Download App:
  • android
  • ios