Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణకు భారీ వర్ష సూచన: ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం

ఎండ, వేడి గాలులతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం వుందని హచ్చరించింది. 

heavy rain alert to telangana
Author
Hyderabad, First Published Apr 10, 2019, 10:11 AM IST

ఎండ, వేడి గాలులతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం వుందని హచ్చరించింది.

భారీ ఈదురు గాలులతో కుండపోత వర్షం కురుస్తుందని తెలిపింది. మంగళవారం హుస్నాబాద్, షాద్‌నగర్, అచ్చంపేటలలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. మరో వైపు భారీ ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.

జయశంకర్ భూపాల్‌పల్లి, వరంగల్, జనగామ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, సిద్దపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, మేడ్చల్- మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో పిడుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

మరోవైపు కోస్తాంధ్రలో వచ్చే నాలుగు రోజుల్లో కొన్ని చోట్ల వర్షం పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 11, 13 తేదీల్లో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది. ఇక రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios