Asianet News TeluguAsianet News Telugu

హాజీపూర్ హార్రర్: కాల్‌డేటా ఆధారంగా శ్రీనివాస్ రెడ్డి విచారణ

 హాజీపూర్‌లో ముగ్గురు విద్యార్ధినులపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు శ్రీనివాస్ రెడ్డి కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గురువారం నాటికి శ్రీనివాస్ రెడ్డి  కస్టడీ రెండో రోజుకు చేరుకొంది

hazipur serial murders:police plans to verify call data of srinivas reddy
Author
Hyderabad, First Published May 9, 2019, 12:34 PM IST


హైదరాబాద్:  హాజీపూర్‌లో ముగ్గురు విద్యార్ధినులపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు శ్రీనివాస్ రెడ్డి కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గురువారం నాటికి శ్రీనివాస్ రెడ్డి  కస్టడీ రెండో రోజుకు చేరుకొంది. సరూర్‌ నగర్‌ ఎస్ఓటీ కార్యాలయంలో  సిట్ బృందం శ్రీనివాస్ రెడ్డిని విచారిస్తున్నారు.

హాజీపూర్ గ్రామంలో  ముగ్గురు విద్యార్ధినులతో పాటు హత్య చేసినట్టుగా శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే ఒప్పుకొన్నారని పోలీసులు ప్రకటించారు. అయితే శ్రావణి కేసులో మాత్రమే శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఈ నలుగురితో విద్యార్థినులతో పాటు కర్నూల్‌లో సెక్స్ వర్కర్‌ను కూడ హత్య చేసిన విషయాన్ని శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకొన్న  విషయాన్ని పోలీసులు ప్రకటించారు.ఈ నలుగురితో పాటు  ఇంకా ఎవరినైనా శ్రీనివాస్ రెడ్డి హత్య చేశారా... ఇంకా ఈ తరహా ఘటనలకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

బుధవారం నాడు పోలీసులు వరంగల్ సెంట్రల్ జైల్ నుండి  శ్రీనివాస్ రెడ్డిని  తమ కస్టడీలోకి తీసుకొన్నారు. వరంగల్ నుండి నేరుగా ఆయనను సరూర్ నగర్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారిస్తున్నారు.

శ్రీనివాస్ రెడ్డి ఉపయోగించిన సెల్‌ఫోన్ ఆధారంగా  ఆయనను విచారిస్తున్నారు. కాల్‌డేటాలో శ్రీనివాస్ రెడ్డితో ఉన్న సంబంధాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ముగ్గురు మైనర్ బాలికలను హత్య చేసే సమయంలో  శ్రీనివాస్ రెడ్డి ఎవరి సహాయమైనా తీసుకొన్నారా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీనివాస్ రెడ్డిపై ఉన్న నేర చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని కూడ పోలీసులు తవ్వుతున్నారు. ఇదిలా ఉంటే శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎక్కడున్నారనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తును చేపట్టారు.

శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిన వెంటనే ఆ కుటుంబం గ్రామాన్ని విడిచి వెళ్లిపోయింది. ఇంతవరకు ఆ కుటుంబసభ్యులు గ్రామానికి రాలేదు. వారంతా ఎక్కడ ఉన్నారనే విషయాన్ని కూడ పోలీసులు కనుక్కొనే ప్రయత్నం చేస్తున్నారు.

శ్రీనివాస్ రెడ్డి చేసిన నేరాలు కుటుంబసభ్యులకు ముందే తెలుసా... చేసిన తర్వాత చెప్పాడా.... అసలు వారికి తెలియకుండానే  ఈ ఘటనలకు ఆయన పాల్పడ్డాడా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

హజీపూర్ సీరియల్ కిల్లర్ ప్రేయసి గురించి పోలీసుల ఆరా

హాజీపూర్ హార్రర్: శ్రీనివాస్ రెడ్డిని పోలీస్ కస్టడీకి అనుమతి

హాజీపూర్ హార్రర్: మనీషా, కల్పన కుటుంబాలకు డీఎన్ఏ పరీక్షలు

హాజీపూర్ హార్రర్: పాడుబడిన బావులపై ఆందోళన

హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి లవర్ సేఫ్

హాజీపూర్‌ సీరియల్ కిల్లర్: శ్రీనివాస్ రెడ్డి ప్రియురాలు ఎవరు?

సైకో కిల్లర్ శ్రీనివాస్‌ రెడ్డిలో మరో కోణం: వేములవాడ యువతితో లవ్

హాజీపూర్ సీరియల్ కిల్లర్: ఆదిలాబాద్‌లో దెబ్బలు తిన్న శ్రీనివాస్ రెడ్డి
  హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి లైఫ్‌లో మరో కోణం (వీడియో)

సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి 14 రోజుల రిమాండ్, వరంగల్ జైలుకు తరలింపు

చెట్టుకు కట్టేసి కొట్టారు: ఆ కక్షతోనే శ్రీనివాస్ రెడ్డి ఘాతుకాలు

వెలుగులోకి విస్తుపోయే విషయాలు: శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కండోమ్ ప్యాకెట్లు

హాజీపూర్‌ దారుణాలు: శ్రీనివాస్ రెడ్డి బావిలో దొరికిన ఎముకలు ఎవరివి?

హజీపూర్ సీరియల్ మర్డర్స్: విచారణకు ప్రత్యేక బృందం

కల్పన డెడ్‌బాడీ కోసం శ్రీనివాస్ రెడ్డి బావిలో పోలీసుల గాలింపు

శ్రావణి హత్య కేసు: గ్రామస్తులతో కలిసి బావి వద్దే శ్రీనివాస్ రెడ్డి

హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి చరిత్ర ఇదీ...

శ్రీనివాస్ రెడ్డి మరో బావిలో కల్పన మృతదేహం లభ్యం

బైక్‌పై శ్రావణితో: శ్రీనివాస్ రెడ్డిని పట్టించిన సీసీటీవీ పుటేజీ

శ్రీనివాస్ రెడ్డిపై కర్నూల్ లో మహిళను హత్య చేసిన కేసు

హాజీపూర్‌ దారుణాలు: కల్పనను మింగేసిందీ వాడే

Follow Us:
Download App:
  • android
  • ios