Asianet News TeluguAsianet News Telugu

ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి, ఇప్పుడొచ్చావ్: ఎమ్మెల్యే సునీతను నిలదీసిన హజీపూర్ గ్రామస్థులు

ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి చెప్పాలని నిలదీశారు. మెుదటి హత్య జరిగిననాడు చర్యలు తీసుకుంటే ఇలాంటి దారుణాలు జరగవు కదా అంటూ నిలదీశారు. శ్రావణి హత్య జరిగి నాలుగురోజులు కావస్తోంది అప్పటి నుంచి తాము పోరాటం చేస్తున్నాం ఇప్పుడు గుర్తుకు వచ్చామా అంటూ నిలదీశారు. 
 

hajipura Villagers who stood up for MLA sunitha
Author
Bommalramaram, First Published May 1, 2019, 6:14 PM IST

యాదాద్రి: ఆలేరు ఎమ్మెల్యే గొంగినీడి సునీతకు చేదు అనుభవం ఎదురైంది. వరుస హత్యల జరిగిన హజీపూర్ గ్రామాన్ని సందర్శించేందుకు ఎమ్మెల్యే సునీత చేరుకున్నారు. ముగ్గురు బలయ్యారు ఇంకెంతమంది చావాలి ఇప్పుడు వస్తారా అంటూ మహిళలు నిలదీశారు. 

ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి చెప్పాలని నిలదీశారు. మెుదటి హత్య జరిగిననాడు చర్యలు తీసుకుంటే ఇలాంటి దారుణాలు జరగవు కదా అంటూ నిలదీశారు. శ్రావణి హత్య జరిగి నాలుగురోజులు కావస్తోంది అప్పటి నుంచి తాము పోరాటం చేస్తున్నాం ఇప్పుడు గుర్తుకు వచ్చామా అంటూ నిలదీశారు. 

పోనీ ఈ హత్యలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పండంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన మానవ మృగం మర్రి శ్రీనివాస్ రెడ్డికి మరణ శిక్ష విధించేలా చూసి పుణ్యం కట్టుకోవాలని హితవు పలికారు. 

మరోవైపు ఎమ్మెల్యే సునీత తాను ఆలస్యంగా స్పందించానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. శ్రావణి హత్యకు గురైన రోజే తాను ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులను పరామర్శించానని తెలిపారు. 

గ్రామంలోకి వెళ్లి పరామర్శిద్దామని భావించానని అయితే గ్రామస్థులు ఆగ్రహంగా ఉండటంతో వెళ్లొద్దని పోలీసులు సూచించినట్లు తెలిపారని చెప్పుకొచ్చారు. ఇప్పటికే నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి ఇంటిని తగులబెట్టేశారని ఇప్పుడు గ్రామానికి వెళ్తే లేనిపోని సమస్యలు వస్తాయని ఇన్విస్టిగేషన్ కు ఇబ్బందికరంగా మారుతుందని చెప్పారని అందువల్లే రాలేకపోయానని చెప్పుకొచ్చారు. ఇకపోతే బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తరపున కృషి చేస్తానని ఎమ్మెల్యే సునీత హామీ ఇచ్చారు. 

ఈ వార్తలు కూడా చదవండి

సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి 14 రోజుల రిమాండ్, వరంగల్ జైలుకు తరలింపు

చెట్టుకు కట్టేసి కొట్టారు: ఆ కక్షతోనే శ్రీనివాస్ రెడ్డి ఘాతుకాలు

వెలుగులోకి విస్తుపోయే విషయాలు: శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో కండోమ్ ప్యాకెట్లు

హాజీపూర్‌ దారుణాలు: శ్రీనివాస్ రెడ్డి బావిలో దొరికిన ఎముకలు ఎవరివి?

హజీపూర్ సీరియల్ మర్డర్స్: విచారణకు ప్రత్యేక బృందం

కల్పన డెడ్‌బాడీ కోసం శ్రీనివాస్ రెడ్డి బావిలో పోలీసుల గాలింపు

శ్రావణి హత్య కేసు: గ్రామస్తులతో కలిసి బావి వద్దే శ్రీనివాస్ రెడ్డి

హాజీపూర్ సీరియల్ రేపిస్ట్: శ్రీనివాస్ రెడ్డి చరిత్ర ఇదీ...

శ్రీనివాస్ రెడ్డి మరో బావిలో కల్పన మృతదేహం లభ్యం

బైక్‌పై శ్రావణితో: శ్రీనివాస్ రెడ్డిని పట్టించిన సీసీటీవీ పుటేజీ

శ్రీనివాస్ రెడ్డిపై కర్నూల్ లో మహిళను హత్య చేసిన కేసు

హాజీపూర్‌ దారుణాలు: కల్పనను మింగేసిందీ వాడే

Follow Us:
Download App:
  • android
  • ios