Asianet News TeluguAsianet News Telugu

తెలుగు రాష్ట్రాల విద్యుత్ వెబ్ సైట్లు హ్యాక్.. రూ.35కోట్లు డిమాండ్

తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల కన్ను పడింది. ఏపీ, తెలంాణకు చెందిన పలు విద్యుత్ పంపిణీ సంస్థల వెబ్ సైట్లను హ్యాక్ చేశారు. 

hackers attack on  power distribution websites on ap and telangana
Author
Hyderabad, First Published May 2, 2019, 11:25 AM IST


తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల కన్ను పడింది. ఏపీ, తెలంాణకు చెందిన పలు విద్యుత్ పంపిణీ సంస్థల వెబ్ సైట్లను హ్యాక్ చేశారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ( టీఎస్ఎన్పీడీసీఎల్), దక్షిణ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్), తూర్పు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) లకు చెందిన అధికారిక వెబ్ సైట్లు హ్యాకింగ్ కి గురయ్యాయి.

అంతర్జాతీయ హ్యాకర్లు హ్యాక్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ర్యాన్ సమ్ వేర్ వైరస్ ద్వారా సర్వర్లలో ఉన్న డేటాను దొంగలించి.. డేటాను పూర్తిగా తొలగించారు. ఈ డేటాను తిరిగి వెనక్కి ఇచ్చేందుకు రూ.35 కోట్లు డబ్బు డిమాండ్‌ చేశారు. సమాచారం అంతా బ్యాకప్‌ ఉండడంతో ముప్పు తప్పింది.

 డిస్కంల హ్యాకింగ్‌పై సీసీఎస్‌ పోలీసులకు టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ఫిర్యాదు చేసింది. ఐటీ యాక్టు కింద సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios