Asianet News TeluguAsianet News Telugu

గురుకుల మెయిన్స్ వాయిదా

టిఎస్పిఎస్సీ యాజమాన్యం మెట్టు దిగింది. గురుకుల మెయిన్స్ పరీక్షలను 15 రోజుల పాటు వాయిదా వేసింది. పెద్ద సంఖ్యలో వినతులు రావడంతో వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది టిఎస్పిఎస్సీ. గురుకుల ప్రిలిమినరీ పరీక్ష పలితాలపై ఇంకా స్పష్టత ఇవ్వకుండా  దాటవేసింది టిఎస్సీఎస్సీ. 

gurukul mains postponed

తెలంగాణలో గురుకుల మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈనెల 29, 30 తేదీల్లో జరగాల్సిన పిజిటి మెయిన్స్ వచ్చే నెల 18, 19 తేదీలకు వాయిదా పడ్డాయి.

gurukul mains postponed

 

అలాగే జులై 4, 5, 6 తేదీల్లో జరగాల్సిన టిజిటి మెయిన్స్ పరీక్షలు జులై 20, 21, 22 తేదీలకు వాయిదా పడ్డాయి.

 

పిడి పోస్టులకు సైతం జులై 18న పరీక్ష జరగనుంది.

 

gurukul mains postponed

పరీక్షలు వాయిదా వేయాలంటూ పెద్ద సంఖ్యలో వినతులు వచ్చినందున ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు టిఎస్సీఎస్సీ ప్రకటించింది. వేలాది మంది వ్యక్తిగతంగా వాయిదా వేయాలని కోరినట్లు ప్రకటనలో పేర్కొంది టిఎస్సీఎస్సీ.

 

మరోవైపు ప్రిలిమినరీ పరీక్షలు జరపకుండా మెయిన్స్ పరీక్షలకు తేదీలు ప్రకటించడం పట్ల నిరుద్యోగ అభ్యర్థులు మండిపడ్డారు. ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటించాలని, మెయిన్స్ వాయిదా వేయాలని పెద్ద ఎత్తున ఓయు లో నిరసనలు సైతం చేశారు.

దీంతో దిగివచ్చిన టిఎస్పిఎస్సీ పరీక్ష తేదీలను వాయిదా  వేసింది. కానీ ప్రిలిమినరీ ఫలితాలు మాత్రం ఎప్పుడు వెల్లడించేది ఇంకా తేల్చలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios