Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ కి మరో గూగుల్ క్యాంపస్

హైదరాబాద్ నగరంలో ప్రముఖ కార్పొరేట్ కంపెనీ గూగుల్  కార్యాలయం రానుంది. .

Google's biggest campus outside US in Hyderabad
Author
Hyderabad, First Published Feb 21, 2019, 4:32 PM IST

హైదరాబాద్ నగరంలో ప్రముఖ కార్పొరేట్ కంపెనీ గూగుల్  కార్యాలయం రానుంది. ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ గూగుల్ త్వ‌ర‌లో న‌గ‌రంలోని గ‌చ్చిబౌలి నాన‌క్‌రాంగూడ ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌లో అతి పెద్ద క్యాంప‌స్‌ను ఏర్పాటు చేయ‌నుంది.ఇప్ప‌టికే ఈ కార్యాల‌య నిర్మాణానికి గాను అవ‌స‌ర‌మైన అనుమ‌తుల కోసం గూగుల్ ప్ర‌య‌త్నిస్తున్న‌ది. దీంతో త్వ‌ర‌లో ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌లో గూగుల్ మ‌రో క్యాంప‌స్ ఏర్పాటు కానుంది. 

హైద‌రాబాద్‌లో గూగుల్ కు ఇప్ప‌టికే కొండాపూర్ లో ఓ కార్యాల‌యం ఉంది. అందులో 7వేల మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. కాగా ఇప్పుడు నాన‌క్‌రాంగూడలో నిర్మించ‌నున్న క్యాంప‌స్ గూగుల్‌కు హైద‌రాబాద్‌లో రెండోది. ఈ నిర్మాణానికి 2015లోనే అంకురార్ప‌ణ జ‌రిగింది.

మొత్తం 22ఫ్లోర్లతో భవనాన్ని ఒకే బ్లాక్ గా నిర్మించనున్నారు. రూ.వెయ్యి కోట్లతో ఈ క్యాంపస్ ను నిర్మించనున్నారు. అలాగే భ‌వనానికి పూర్తిగా సోలార్ విద్యుత్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో మొత్తం కార్యాల‌యానికి 300 కిలోవాట్ల విద్యుత్ అవ‌స‌రం ఉంద‌ని తేల్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios