Asianet News TeluguAsianet News Telugu

టికెట్ ఇస్తానంటేనే పార్టీలో చేరా.. ఇప్పుడేమో... గండ్ర

పార్టీ ఫౌండర్‌ తాను అని, తనకు తెలియకుండా టికెట్‌ఎవరు ఇస్తారని మధు సూదనాచారి ప్రకటన చేయడం విడ్డూరం గా ఉందని పేర్కొన్నారు. 

gandra satyanarayana once again upset over trs candidates list
Author
Hyderabad, First Published Oct 1, 2018, 10:18 AM IST

టికెట్ ఇస్తానని  హామీ ఇవ్వడం వల్లనే తాను టీఆర్ఎస్ లో చేరానని ఆ పార్టీ నేత గండ్ర సత్యనారాయణ పేర్కొన్నారు.  వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి టికెట్ వస్తుందని ఎంతో ఆశించానని.. నమ్ముకున్న పార్టీనే తనను మోసం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం పలు వ్యాపార సముదాయాల్లో ఆయన ప్ర చారం నిర్వహించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎంపీ వినోద్‌కుమార్‌ల హామీ మేరకు టికెట్‌ ఇస్తానంటేనే టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరానని అన్నారు. పార్టీ ఫౌండర్‌ తాను అని, తనకు తెలియకుండా టికెట్‌ఎవరు ఇస్తారని మధు సూదనాచారి ప్రకటన చేయడం విడ్డూరం గా ఉందని పేర్కొన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌, వినోద్‌కుమార్‌లతో తనకు టికెట్‌ ఇస్తానని హామీ ఇవ్వలేదని మధుసూదనాచారి చెప్పిస్తే జిల్లా కేంద్రంలోని జయశంకర్‌ విగ్రహం సమీపంలో తాను ముక్కు భూమికి రాస్తానని సత్యనారాయణరావు స్పష్టం చేశారు.
 
వ్యాపారాలు పెంచుకోవడానికో.. ఉన్న ఆస్తులను కాపాడుకోవడానికో తాను రాజకీయాల్లోకి రావడంలేదని, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్ధేశంతో స్వ తంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నట్లు తెలిపా రు. గతంలో స్థానికేతరులైన రమణారెడ్డి, మధుసూదనాచారిలకు అవకాశం కల్పించారని, ఈసారి నియోజకవర్గ బిడ్డనైన తనను ఆదరించాలని ఆయన కోరారు. సింగరేణి, జెన్‌కోలలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేలా, పోడు భూములు చేసుకుంటున్న రైతులకు పట్టాలిచ్చేలా, సింగరేణి ఏరియా ఆస్పత్రిలోని వైద్యుల పోస్టుల భర్తీకి కృషి చేయనున్నట్లు సత్యనారాయణరావు హామీ ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios