Asianet News TeluguAsianet News Telugu

తొలిసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో అడుగు పెట్టిన సుహాసిని

కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా సుహాసిని శనివారం నామినేషన్‌ వేశారు. బాబాయి బాలకృష్ణ, పార్టీ నేత పెద్దిరెడ్డితో కలిసి ఉదయం 11:21 గంటలకు ముసాపేట జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఆమె నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. 

First time Suhasini enters NTR Trust Bhavan
Author
Hyderabad, First Published Nov 18, 2018, 8:14 PM IST

హైదరాబాద్: కూకట్‌పల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి, ఎన్టీఆర్ మనవరాలు నందమూరి సుహాసిని తొలిసారి పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో అడుగు పెట్టారు. మహాకూటమి తరుపున సుహాసినికి కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం ఆమె బీఫామ్స్ తీసుకునేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వచ్చారు. 

లోనికి అడుగు పెట్టిన తర్వాత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా సుహాసిని శనివారం నామినేషన్‌ వేశారు. బాబాయి బాలకృష్ణ, పార్టీ నేత పెద్దిరెడ్డితో కలిసి ఉదయం 11:21 గంటలకు ముసాపేట జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఆమె నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. 

అంతకుముందు ఆమె బాలకృష్ణ, రామకృష్ణ, ఇతర నందమూరి కుటుంబసభ్యులతో కలిసి ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకొని నివాళులర్పించారు. మహాకూటమిలో భాగంగా టీటీడీపీ 14 స్థానాలు కేటాయించారు. అయితే 13 నియోజకవర్గాలకు మాత్రమే టీడీపి అభ్యర్థులను ప్రకటించింది. 
 
నియోజకవర్గం పరంగా పోటీ చేసే అభ్యర్థులు వీరే..

కూకట్ పల్లి- నందమూరి సుహాసిని
ఖమ్మం- నామా నాగేశ్వరరావు
సత్తుపల్లి- సండ్ర వెంకట వీరయ్య
అశ్వరావుపేట- మచ్చా నాగేశ్వర్‌రావు
మహబూబ్‌నగర్- ఎర్ర శేఖర్
మక్తల్- కొత్తకోట దయాకర్ రెడ్డి
శేరిలింగంపల్లి- భవ్య ఆనంద ప్రసాద్
ఉప్పల్- వీరేందర్ గౌడ్
మలక్‌పేట-ముజఫర్
వరంగల్ పశ్చిమ- రేవూరి ప్రకాశ్‌రెడ్డి
రాజేంద్రనగర్- గణేష్ గుప్తా
ఇబ్రహీం పట్నం- సామ రంగారెడ్డి
సనత్ నగర్- కూన శ్రీశైలం గౌడ్

సంబంధిత వార్తలు

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి సుహాసిని ఆస్తులివే

కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సుహాసిని

సుహాసినికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంపై స్పందించిన బాలయ్య

ఎన్టీఆర్‌‌కు నివాళులర్పించిన నందమూరి సుహాసిని

బరిలోకి సుహాసిని: తెర వెనక భువనేశ్వరి

మాధవరం తెలుగుదేశం ద్రోహి, అతన్ని ఓడిస్తా.. సుహాసిని నా బిడ్డ: పెద్దిరెడ్డి

అందుకే రాజకీయాల్లోకి వచ్చా, తండ్రిని తల్చుకొని కన్నీళ్లు పెట్టుకొన్న సుహాసిని

హరికృష్ణ సానుభూతి, ఎన్టీఆర్ ఛరిష్మా: టీడీపీ తురుపుముక్క సుహాసిని

నందమూరి సుహాసినీపై.. మిత్రపక్షం కాంగ్రెస్ తిరుగుబాటు

కూకట్‌పల్లి సుహాసినికి కేటాయింపు: బాబు వద్దకు పెద్దిరెడ్డి

మీడియా ముందుకు నందమూరి సుహాసిని

33 ఏళ్ల తర్వాత తెలంగాణలో నందమూరి ఫేటు ఎలా ఉందో, నాడు ఎన్టీఆర్...నేడు సుహాసిని

‘‘ఆ’’ సాయమే హరికృష్ణ కుమార్తె సుహసిని మనసు మార్చిందా..?

హరికృష్ణ కుమార్తెకే కూకట్ పల్లి టిక్కెట్, 17న సుహాసిని నామినేషన్

సుహాసిని కోసం జూ.ఎన్టీఆర్: ప్రచారానికి బాలయ్య, విజయశాంతి జోడి

చంద్రబాబుతో భేటీ: కూకట్‌పల్లి సీటు హరికృష్ణ కూతురు సుహాసినికే

తెరపైకి హరికృష్ణ కూతురి పేరు: కూకట్‌పల్లిపై ఉత్కంఠ

హరికృష్ణ కూతురు పోటీకి జూ.ఎన్టీఆర్ బ్రేక్

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె..?

Follow Us:
Download App:
  • android
  • ios