Asianet News TeluguAsianet News Telugu

అజారుద్దీన్ కు కీలక బాధ్యతలు...రాహుల్ నిర్ణయం

తెలంగాణ ఎన్నికల సమయంలో దగ్గరుపడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం  తీసుకుంది. కొందరు నాయకులకును తెలంగాణ పార్టీ కీలక పదవుల్లో నియమిస్తూ రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ముఖ్యంగా మాజీ క్రికెటర్, మాజీ ఎంపి మహ్మద్ అజారుద్దిన్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఏఐసిసి జనరల్ సెక్రటరీ అశోక్ గెహ్లాట్ ఓ ప్రకటన విడుదల చేశారు.
 
ex mp azharuddin appointed as tpcc working president
Author
Hyderabad, First Published Nov 30, 2018, 4:15 PM IST

తెలంగాణ ఎన్నికల సమయంలో దగ్గరుపడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం  తీసుకుంది. కొందరు నాయకులకును తెలంగాణ పార్టీ కీలక పదవుల్లో నియమిస్తూ రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ముఖ్యంగా మాజీ క్రికెటర్, మాజీ ఎంపి మహ్మద్ అజారుద్దిన్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఏఐసిసి జనరల్ సెక్రటరీ అశోక్ గెహ్లాట్ ఓ ప్రకటన విడుదల చేశారు.

సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని అజార్ కు ఈ కీలక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్ లు ఉండగా అజార్ నాలుగోవాడు. ఇంతకుముందు రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కుసుమ్ కుమార్‌లు ఈ పదవిలో కొనసాగుతుండగా తాజాగా నాలుగో అజార్ ఆ జాబితాలో చేరారు. 

ఆయనతో పాటు మరికొంత మంది నాయకులకు కూడా టిపిసిసి  లో స్థానం కల్పించారు. టిపిసిసి వైస్ ప్రెసిడెంట్లు గా  బి.ఎమ్.వినోద్ కుమార్, జాపర్ జావేద్ లు నియమితులయ్యారు. అలాగే పార్టీ జనరల్ సెక్రటరీలుగా ఎస్.జగదీశ్వర్ రావు, నగేష్ ముదిరాజ్, టి.నర్సారెడ్డి, మానవతారాయ్, ఫహీమ్, కైలాష్, క్రిషాంక్, లక్ష్మారెడ్డిలను నియమించారు. ఇక సెక్రటరీలుగా దుర్గం భాస్కర్, దరువు ఎల్లన్న, విజయ్ కుమార్, బాల లక్ష్మి లను నియమించారు.

Follow Us:
Download App:
  • android
  • ios