Asianet News TeluguAsianet News Telugu

ఈఎస్ఐ స్కాంలో సంచలన విషయాలు: రూ.46 కోట్ల ఇండెంట్లు స్వాధీనం

ఈఎస్ఐ డైరెక్టర్ కార్యాలయంలో ఉండాల్సిన ఇండెంట్లు ఏజెంట్ నాగరాజు నివాసంలో ఉండటంపై అవినీతి శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కేసుకు సంబంధించి మరికొంతమంది అధికారులు, ప్రైవేట్ వ్యక్తులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. 
 

esi scam case: acb officials enquiry at omni agent house,rs 46 crows indents seize
Author
Hyderabad, First Published Oct 2, 2019, 4:44 PM IST

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కాంలో తవ్వుతున్న కొద్దీ అక్రమాలపుట్ట కదులుతోంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు మంగళవారం ఓమ్నీ సంస్థ ఏజెంట్ నాగరాజు నివాసంలో సోదాలు నిర్వహించారు. 

ఈసోదాలో భారీగా డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. అధికార పత్రాలు, సుమారు రూ.46 కోట్ల విలువైన ఇండెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా రూ.46 కోట్ల మేర విలువైన ఇండెంట్లు ఏజెంట్ల ఇళ్లలో లభ్యం కావడంతో ఏసీబీ అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. 

ఈఎస్ఐ డైరెక్టర్ కార్యాలయంలో ఉండాల్సిన ఇండెంట్లు ఏజెంట్ నాగరాజు నివాసంలో ఉండటంపై అవినీతి శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కేసుకు సంబంధించి మరికొంతమంది అధికారులు, ప్రైవేట్ వ్యక్తులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. 

ఇకపోతే ఈఎస్ఐ మందుల కుంభకోణంలో ఓమ్నీ మెడి సంస్థ నుంచి భారీగా ఔషధాలు, పరీక్షల కిట్లు ఈఎస్ఐ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణితోపాటు పలువురు అధికారులు రిమాండ్ లో ఉన్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఈఎస్‌ఐ స్కాం: ఉచ్చు బిగుస్తున్న ఏసీబీ అధికారులు

Follow Us:
Download App:
  • android
  • ios