Asianet News TeluguAsianet News Telugu

జనగామపై ట్విస్ట్: కోదండరామ్‌ చేతిలోనే పొన్నాల భవితవ్యం

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ సీటు విషయమై  టీజేఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య  జగడం  ఇంకా తేలలేదు

continues suspense on janagaon assembly seat
Author
Hyderabad, First Published Nov 16, 2018, 4:48 PM IST


హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ సీటు విషయమై  టీజేఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య  జగడం  ఇంకా తేలలేదు. వారం రోజులుగా ఈ సీటుపై  ఈ రెండు పార్టీల మధ్య ఎడతెగని పంచాయితీ సాగుతోంది. జనగామ నుండి పోటీ చేసేందుకు  కోదండరామ్ రంగం సిద్దం చేసుకొంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో టీజేఎస్ చీఫ్ కోదండరామ్‌ గురువారం రాత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సీట్ల సర్ధుబాటు విషయమై చర్చించారు.  మరోవైపు  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీతో  మాజీ పీసీసీ చీఫ్  పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం నాడు ఉదయం సమావేశమయ్యారు. 

అయితే ఈ సమావేశంలో జనగామ సీటు విషయమై టీజేఎస్ చీఫ్ కోదండరామ్‌తో మాట్లాడుకోవాలని  సూచించినట్టు సమాచారం.  అయితే  జనగామ సీటు విషయమై  కాంగ్రెస్ పార్టీ నేతలు  ఎవరూ కూడ తనతో మాట్లాడలేదని టీజేఎస్ చీఫ్ కోదండరామ్ తేల్చి చెప్పారు.

జనగామ నుండి పోటీ చేసేందుకు  కోదండరామ్  రంగం సిద్దం చేసుకొంటున్నారు. ప్రచారరథాన్ని, ప్రచార సామాగ్రిని కూడ కోదండరామ్ జనగామకు పంపారు. కానీ, పొన్నాల కూడ  కాంగ్రెస్ పార్టీ తరపున జనగామ నుండి పోటీ విషయమై సందిగ్ధత నెలకొంది.

కాంగ్రెస్ పార్టీ తీరుపై  టీజేఎస్ నాయకత్వం  తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ తీరు సరిగా లేదని కోదండరామ్ విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ఫైనల్ అయినందున  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంఛార్జీ కుంతియాతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు  ఢిల్లీ నుండి నేరుగా  కోదండరామ్‌ను కలవనున్నారు.

ఈ మేరకు కోదండరామ్‌ను  కలుస్తామని  ఉత్తమ్ ఫోన్లో‌ సమాచారం ఇచ్చారు. ఢిల్లీ నుండి నేరుగా ఉత్తమ్‌తో పాటు  ఇతర నేతలు  కోదండరామ్‌ను కలవనున్నారు.శుక్రవారం నాడు సాయంత్రానికి జనగామ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం. కోదండరామ్‌కు కేటాయించే సీటు విషయంలో  జనగామతో పాటు మరో సీటును కూడ సూచించింది. ఈ కారణంగానే  జనగామ సీటును ఇంకా ప్రకటించలేదని సమాచారం.

సంబంధిత వార్తలు

ఎట్టకేలకు మర్రి, పొన్నాల సీట్లకు లైన్‌క్లియర్

మహాకూటమికి సెగ: ఢీకొట్టేందుకు రెబెల్స్ కూటమి

రాహుల్ ఇంటి ముందు బండ కార్తీక్ రెడ్డి బైఠాయింపు

రూ. 10 కోట్లు తీసుకొని దానంపై దాసోజుకు టికెట్టు: క్యామ మల్లేష్ సంచలనం

శంషాబాద్ పార్టీ కార్యాలయం వద్ద కార్తీక్ రెడ్డి వీరంగం...

కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

రాజేంద్రనగర్‌లో రెబెల్‌గా సబితా తనయుడు
కాంగ్రెస్‌కు సబిత తనయుడు కార్తీక్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ మూడో జాబితా: పొన్నాలకు క్లియర్, జానా కొడుక్కి టికెట్టు

కోదండరామ్ ఎలా గెలుస్తాడో చెప్పండి: పొన్నాల సవాల్

పొన్నాలకు దక్కని టికెట్ ... కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు

జనగామ నుండి తప్పుకొన్న కోదండరామ్: పొన్నాలకు లైన్‌క్లియర్

జనగామ టికెట్ నాదే..ధీమా వ్యక్తం చేసిన పొన్నాల

కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం

పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్

జనగామ పొన్నాలకే... హైకమాండ్ రహస్య సంకేతాలు: ఆ వర్గానికి షాక్

కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య

జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్

జనగామలో పొన్నాలకు కోడలు చిక్కులు

పొన్నాలకు కాంగ్రెస్ నేతల షాక్

పొన్నాలకు కోమటిరెడ్డి పొ

Follow Us:
Download App:
  • android
  • ios