Asianet News TeluguAsianet News Telugu

అక్కడ కేటీఆర్, ఇక్కడ రేవంత్

తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల విమర్శల ప్రతి విమర్శలతో తెలంగాణ రాష్ట్రం మార్మోగుతోంది. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ కేటీఆర్, ఇటు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 
 

congress working president revanthreddy says he will adopted siricilla constituency
Author
Sircilla, First Published Nov 26, 2018, 8:04 PM IST

సిరిసిల్ల: తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల విమర్శల ప్రతి విమర్శలతో తెలంగాణ రాష్ట్రం మార్మోగుతోంది. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ కేటీఆర్, ఇటు కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 

ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని అటు సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ప్రయత్నిస్తుంటే కేటీఆర్ ను ఎలాగైనా ఓడించాలని రేవంత్ రెడ్డి మాంచి కసితో రగిలిపోతున్నారు. 

ఇటీవలే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్ లో పర్యటించిన మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే తాను కొడంగల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. కేటీఆర్ రాక సందర్భంగా టీఆర్ఎస్ నేతలు భారీ జన సమీకరణ చేసి బల ప్రదర్శనకు సైతం దిగారు. 

కేటీఆర్ ప్రకటనతో రగిలిపోతున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా చుట్టేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్లలో పర్యటించిన రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై ధ్వజమెత్తారు. 

అంతేకాదు తన నియోజకవర్గంలో కేటీఆర్ ఇచ్చిన హామీకి తిరిగి కౌంటర్ ఇచ్చేశారు. మంత్రి కేటీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు ఫైర్ బ్రాండ్ లు ఎక్కడ తగ్గడం లేదు అన్నట్లు సిగ్నల్స్ ఇచ్చారు. తెలంగాణలో లక్షా ఏడు వేల ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్‌ ఉద్యోగం ఉడగొట్టాలని ప్రజలకు రేవంత్  పిలుపున్చిచ్చారు. 
 
సిరిసిల్ల కూటమి అభ్యర్థి మహేందర్‌ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. సిరిసిల్ల జిల్లా ఎవరి దయాదాక్షణ్యాల వల్ల రాలేదని, ఇక్కడి ప్రజలే పోరాడి సాధించుకున్నారని పేర్కొన్నారు.  

మరోవైపు కేసీఆర్, కేటీఆర్ లపై నిప్పులు చెరిగారు. తండ్రీ కొడుకులిద్దరూ కూతలొళ్లు, కూతల పోటీ పెట్టాలిద్దరికీ అంటూ ఎద్దేవా చేశారు. ఎన్ని అవకాశాలిచ్చినా ఇక్కడి సమస్యలు కేటీఆర్‌ పరిష్కరించలేరు. స్థానికుడే ఇక్కడి నాయకుడు కావాలన్నారు. 

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకపోతే అమెరికా వెళ్లే కేటీఆర్‌కు ఓటు వేస్తారా? ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే గిట్టే మహేందర్‌ రెడ్డికి ఓటు వేస్తారా? తేల్చుకోవాలని ప్రజలకు చెప్పారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌, కేటీఆర్‌లు వారికి కావాల్సింది వారు అయ్యారు. కానీ తెలంగాణ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. 

250 కోట్లు ఖర్చు పెట్టి 150 కోట్లతో రెండు వందలకో చీర కొని బతుకమ్మ చీరలలో కమీషన్‌ నొక్కారని ధ్వజమెత్తారు. వారానికోసారి చేనేత బట్టలు ధరించాలన్న కేటీఆర్‌ ధరిస్తున్నారా? చెప్రాసిగా కూడా కేటీఆర్‌ పనికిరారంటూ ఘాటుగా విమర్శించారు. అమెరికాలో కేటీఆర్‌ బాత్‌రూమ్‌లు కడిగిన విషయం మీ అందరికీ తెలిసే ఉంటుందంటూ విమర్శించారు.  

మరోవైపు టీఆర్ఎస్ పార్టీని గుంజుకోవాలని మంత్రి హరీష్ రావు చూస్తున్నాడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ లు ఒడిపోతే టీఆర్ఎస్ ను తన ఖాతాలోకి వేసుకుందామని హరీష్ ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. ఈ ఎన్నికల్లో 70 సీట్లకు పైగా గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని రేవంత్ తెలిపారు.  

 

ఈ వార్తలు కూడా చదవండి

హరీష్ కోరిక కూడా అదే: గుట్టు విప్పిన రేవంత్ రెడ్డి

హరీష్, కేటీఆర్‌లకు మరోసారి రేవంత్ సవాల్: ఈ సారి స్థలం కూడా...

Follow Us:
Download App:
  • android
  • ios