Asianet News TeluguAsianet News Telugu

స్వయం పాలన, ఆత్మ గౌరవం కోసమే: కేసీఆర్‌పై రేవంత్ విసుర్లు

స్వయంపాలన, ఆత్మగౌరవం కోసం తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దింపాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి  ఆ పార్టీ కార్యకర్తకు పిలుపు నిచ్చారు.

Congress working president revanth reddy sensational comments on KCR
Author
Adilabad, First Published Oct 20, 2018, 3:10 PM IST

ఆదిలాబాద్: స్వయంపాలన, ఆత్మగౌరవం కోసం తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దింపాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి  ఆ పార్టీ కార్యకర్తకు పిలుపు నిచ్చారు.  కేసీఆర్‌ను ఓడించాలనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల  పట్టుదల ముందు టీఆర్ఎస్  అంగబలం, అర్థబలం సాగవని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భైంసాలో శనివారం నాడు నిర్వహించిన  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభలో  ఆయన ప్రసంగించారు. మీ ఉత్సాహాన్ని చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందనే విశ్వాసం కల్గిందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో అపారమైన ఖనిజ సంపద, జీవనదులు ఉన్న జిల్లాగా రేవంత్ అభిప్రాయపడ్డారు.

ఈ జిల్లాకు కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని సంబంధం ఉందని  రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని 8 సీట్లను ఈ జిల్లా నుండి 2004లో గెలిపించారని  ప్రస్తావించారు.

కాంగ్రెస్ పార్టీది కుటుంబ పాలన అని  కేసీఆర్  చేసిన విమర్శలను రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. నెహ్రు బతికున్నంత కాలం ఇంధిరాగాంధీ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారన్నారు. ఇంధిరా గాంధీ బతికున్నంత కాలం రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రాలేదన్నారు.

ఇంధిరాగాంధీ మరణించిన తర్వాత రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చారని రేవంత్ గుర్తు చేశారు.  రాజీవ్ రాజకీయాల్లో ఉన్నంత కాలం  ఆయన కుటుంబం ఏనాడూ కూడ రాజకీయాల్లోకి రాలేదన్నారు.  రాజీవ్ మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ  కోరితే సోనియాగాంధీ దేశానికి నాయకత్వం అందించేందుకు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను స్వీకరించినట్టు రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

సోనియాగాంధీ  రెండు దఫాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన చరిత్ర సోనియాగాంధీదని రేవంత్ ప్రస్తుతించారు. దేశానికి నాయకత్వం ఇచ్చేందుకు పదవులు తీసుకోకుండానే సోనియా, రాహుల్ గాంధీ  పనిచేస్తున్నారని  రేవంత్ కొనియాడారు. 

దేశానికి బలమైన నాయకత్వం ఇచ్చేందుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీని కోసం  తెలంగాణలో కేసీఆర్ ను ఓడించాలని  రేవంత్  ప్రజలను కోరారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ ను ఓడించాలనే కోరిక ఉందన్నారు. సోనియాగాంధీ ఆశీర్వాదం ఉందన్నారు. స్వయం పాలన, ఆత్మగౌరవం కోసం  కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలన్నారు. 

కేసీఆర్‌పై చివరివరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని  రేవంత్ రెడ్డి కోరారు. చివరి వరకు పోరాటం చేస్తే కేసీఆర్ ను గద్దె దించడం సులభమని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

రీ డిజైన్లతో కేసీఆర్ కోట్లు దండుకొంటున్నారు: రాహుల్

బైంసాకు చేరుకున్న రాహుల్ గాంధీ...

తెలంగాణలో రాహుల్ పర్యటన ఇలా సాగనుంది...

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు

కాంగ్రెస్‌కు షాక్: రాహుల్ సభకు పోలీసుల అనుమతి నిరాకరణ

తెలంగాణలో రాహుల్ టూర్: అక్టోబర్ 20న మూడు సభలు

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

Follow Us:
Download App:
  • android
  • ios