Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ కేబినెట్‌లో చేరేవాడిని, టీఆర్ఎస్‌ నుండి ఆఫర్: రేవంత్

రెండు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి  తన ఇంట్లో ఏం దొరకబట్టలేకపోయారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పారు.  

Congress working president revanth reddy interesting comments on ysr
Author
Hyderabad, First Published Oct 22, 2018, 3:17 PM IST


హైదరాబాద్: రెండు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి  తన ఇంట్లో ఏం దొరకబట్టలేకపోయారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చెప్పారు.  తన ఇంట్లో  సోదాల సమయంలో ఏం దొరకకపోవడంతో  ఐటీ అధికారులు  ఒత్తిడికి గురయ్యారని ఆయన అభిప్రాయపడ్డారు.  టీడీపీలో తాను ఉంటే  టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఉండేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం తనకు సంతృప్తిని ఇచ్చిందన్నారు.

ఆదివారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  కాంగ్రెస్  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పలు విషయాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. 

తాను తప్పు చేయలేదన్నారు.అందుకే ఐటీ సోదాలు జరిగితే తాను భయపడలేదన్నారు.  ఐటీ సోదాలు జరిగే విషయమై తనకు ముందే ఉప్పందిందినట్టు చెప్పారు.  ఈ విషయాన్ని ముందుగానే మీడియాకు  చెప్పానని ఆయన గుర్తు చేశారు. ఒకటి తర్వాత ఒకటి కేసులు  తనపై నమోదు చేస్తున్నారని... పదవులు రాకముందే ఈ తరహా కేసుల వల్ల  తనకు  అనుభవాలు మిగులుస్తున్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు.

రెండు రోజుల పాటు ఐటీ అధికారులు తన ఇంట్లో సోదాలు చేసిన  సమయంలో  ఏం దొరకక ఏం కేసులు పెట్టాలనే  ఒత్తిడిలో ఉన్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకొన్నారు.  రెండు రోజుల పాటు ఇంటి తలుపులన్నీ తీసి ఉంచామన్నారు.

 తన కుటుంబసభ్యులతో కలిసి  రియల్ ఏస్టేట్ వ్యాపారం చేసినట్టు రేవంత్ రెడ్డి చెప్పారు.  తాను చేసిన వ్యాపారానికి గాను  ఐటీ పన్ను కట్టినట్టు ఆయన రేవంత్ తెలిపారు. అక్రమ సంపాదన లేదన్నారు. అంతేకాదు సక్రమ సంపాదన కూడ  పెద్దగా లేదని రేవంత్ తేల్చిపారేశారు.

ఓటుకు నోటుకు కేసులో వాడిన రూ. 50 లక్షలు  ఎక్కడివని  ఐటీ అధికారులు తనను అడిగారని చెప్పారు. అయితే  ఎవరినో ఉద్దేశించి ఇక్కడికి వస్తే ఎలా అని తాను ఐటీ అధికారులను ప్రశ్నించినట్టు చెప్పారు. 

చంద్రబాబు లక్ష్యంగా చేసుకొని ఐటీ సోదాలు జరిగాయని రేవంత్ అభిప్రాయపడ్డారు. కానీ, ప్రస్తుతం తాను బాబును సమర్థిస్తూ మాట్లడలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఇద్దరం వేర్వేరు పార్టీల్లో ఉన్నందున  ఇంతకు మించి ఎక్కువగా మాట్లాడలేని పరిస్థితులు తనకున్నాయని రేవంత్ చెప్పుకొచ్చారు..అంతేకాదు ఆ డబ్బు నాదే అని చెబితే  30 శాతం  పన్ను కట్టుకొని  మిగతాది తిరిగి తనకు ఇచ్చేయాలని  కోరితే ఐటీ అధికారులు తెల్లముఖం వేశారన్నారు.

రేవంత్‌ను అరెస్టు చేస్తే తెలంగాణ ఎన్నికల్లో బాబును నిలువరించే అవకాశం ఉంటుందని  కేసీఆర్  మోడీతో చెప్పారని  ఈ విషయం  తనకు కొందరి సన్నిహితుల ద్వారా  తెలిసిందని రేవంత్ రెడ్డి ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. 

2007లో  వైఎస్ ఆర్ బతికున్న కాలంలో  స్వతంత్ర అభ్యర్థిగా తాను ఎమ్మెల్సీగా విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు.  ఆనాడు  తాను కోరుకొంటే వైఎస్ కేబినెట్ లో మంత్రిని అయ్యేవాడినని చెప్పారు.  కానీ,  తాను ఎమ్మెల్సీగా ఎన్నిక కావడానికి  కారణమైన టీడీపీలో చేరినట్టు చెప్పారు.  2014 ఎన్నికల సమయంలో కూడ టీఆర్ఎస్ నుండి తనకు పెద్ద ఎత్తున ఆఫర్లు వచ్చినట్టు రేవంత్ రెడ్డి తెలిపారు.

 హేమా హేమీలను కాదని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టడం తనకు సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఈ విషయాన్ని ఓ టీఆర్ఎస్ నాయకుడే ఓ సందర్భంలో తనను అభినందించాడని రేవంత్ చెప్పారు. టీడీపీలో తనకు అన్నీ అనుకూలంగా ఉండేవన్నారు. తన సలహాలను, సూచలను చంద్రబాబునాయుడు  అవసరాన్ని,సందర్భాన్ని బట్టి తీసుకొనేవారని రేవంత్ తెలిపారు.

టీడీపీలోనే ఉంటే టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఉండేదని రేవంత్ అభిప్రాయపడ్డారు.  వంద శాతం చాన్స్ ఉండేదన్నారు.  ఆనాడు టీడీపీలో ఉన్న 15 మంది ఎమ్మెల్యేల వల్ల ప్రమాదమని గ్రహించినందు వల్లే కేసీఆర్  టీడీపీని రాజకీయంగా దెబ్బకొట్టాడని ఆయన అభిప్రాయపడ్డారు.


సంబంధిత వార్తలు

దమ్ము, ధైర్యం ఉంటే నాపై గెలువు: రేవంత్‌కు నరేందర్ రెడ్డి సవాల్

రేవంత్ రెడ్డిపై పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?
స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా

ముందు నన్ను దాటు...తర్వాతే చంద్రబాబు : కేసీఆర్ కు రేవంత్ సవాల్

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి విచారణ వెనక...

రేవంత్ విచారణపై ఎపి ఇంటలిజెన్స్ ఆరా, ఏం అడిగారంటే..

ఈరోజుకు సెలవ్, 23న మళ్లీ రండి: ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ

ఓటుకు నోటు కేసుతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా:మత్తయ్య

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios