Asianet News TeluguAsianet News Telugu

శక్తిపీఠం సెంటిమెంట్: ఆలంపూర్ నుండి కాంగ్రెస్ ప్రచారం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు  శక్తి పీఠమైన ఆలంపూర్  జోగులాంబ ఆలయం నుండి  గురువారం నాడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

Congress to start election campaign from alampur
Author
Hyderabad, First Published Oct 3, 2018, 2:27 PM IST

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు  శక్తి పీఠమైన ఆలంపూర్  జోగులాంబ ఆలయం నుండి  గురువారం నాడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలోని  ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే  సంపత్ ‌కుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.  ఈ నియోజకవర్గం నుండి  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

ఈ తరుణంలో  కాంగ్రెస్ పార్టీ కూడ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని తలపెట్టింది.  త్వరలోనే రాహుల్‌గాంధీతో కూడ సభలను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ ఆర్‌సీ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు ప్రత్యేక హెలికాప్టర్‌లో హైద్రాబాద్ నుండి  అక్టోబర్ 4 వ తేదీన ఆలంపూర్‌కు చేరుకొంటారు. ఆలంపూర్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. 

శక్తీపీఠంగా ఆలంపూర్ ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం నుండి ప్రచారం ప్రారంభించడం ద్వారా  తమకు కలిసివస్తోందని  కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. తొలుత కాంగ్రెస్ పార్టీ నేతలు ఆలంపూర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన కేసీఆర్ హుస్నాబాద్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అక్టోబర్ మూడో తేదీన నిజామాబాద్, నాలుగో తేదీన నల్గొండ, ఐదో తేదీన వనపర్తి సభల్లో కేసీఆర్ పాల్గొంటారు.

శక్తిపీఠం నుండి  ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించనుంది. అయితే ఈ శక్తి పీఠం సెంటిమెంట్ ఏ మేరకు  ఆ పార్టీకి కలిసివస్తోందో ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.

సంబంధిత వార్తలు

ఆ స్థానాల్లో టీఆర్ఎస్‌కు చుక్కలు చూపుతాం: కొండా సురేఖ

6 నియోజకవర్గాల్లో కాదు కదా.. 6 డివిజన్లలో కూడా.. కొండాకు అంత సీన్ లేదు

సత్తా చూపుతాం: కాంగ్రెస్‌లో చేరిన కొండా దంపతులు

కొండా దంపతులు.. అందుకే అలా మాట్లాడుతున్నారు..వినయ్

దొరల కింద బతికేవాళ్లం కాదు.. సురేఖను లక్ష మెజారిటీతో గెలిపిస్తా: కొండా మురళీ

15 పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థిగా కొండా సురేఖ..?

నేను హరీశన్న వర్గం.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

Follow Us:
Download App:
  • android
  • ios